MODI: భారత్ ఎప్పుడూ శాంతి వైపే: మోదీ

MODI: భారత్ ఎప్పుడూ శాంతి వైపే: మోదీ
X
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తాము ఎవరివైపు లేమన్న మోదీ... అక్రమ వలసదారులపై కీలక ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ అయిన ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఎప్పుడూ శాంతి వైపే ఉంటుందని తెలిపారు. ‘భారత్‌ది తటస్థ వైఖరి కాదు. భారత్‌కు ఓ వైఖరి ఉంది. అదే శాంతి. శాంతి కోసం తీసుకునే చర్యలకు ఇండియా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. జాతీయ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తాం’ అని మోదీ పేర్కొన్నారు. కాగా, ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ కలవడం ఇదే తొలిసారి.

అక్రమ వలసదారులపై మోదీ కీలక ప్రకటన

అమెరికాలో ట్రంప్ టెర్రర్ కొనసాగుతున్న వేళ... ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు దేశమే మొదటి ప్రాధాన్యతని వెల్లడించారు. అక్రమ వలసదారులను స్వదేశానికి పిలిపించేందుకు వెనకాడబోమని మోదీ ప్రకటించారు. అక్రమ వలసలు, టారీఫ్ లపై మోదీ- ట్రంప్ ల మధ్య కీలక చర్చలు జరిగాయి. మానవ అక్రమ రవాణను అరికట్టాలని ఇద్దరు దేశాధినేతలు నిర్ణయించారు.

అదే నా ఆశ: ప్రధాని మోదీ

భారత్, అమెరికా బంధం మరింత బలోపేతం కావాలని ప్రధాని మోదీ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ అనంతరం ప్రధాని మాట్లాడారు. మరింత ఎత్తుకు ఎదగడం అనేది తన ఆశని పేర్కొన్నారు. ఇక యుద్ధం గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడటం అభినందనీయమన్నారు. అలాగే, ఉక్రెయిన్‌లో శాంతి స్థాపన ప్రయత్నాలు జరగడం గొప్ప విషయమన్నారు. తనలాగే ట్రంప్‌కు ఫస్ట్ ప్రియారిటీ దేశమేనేనని పేర్కొన్నారు.

మస్క్‌తో భేటీపై ప్రధాని మోదీ ట్వీట్

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ పంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌తో భేటీ అయ్యారు. మోదీ బస చేసిన బ్లెయిర్‌ హౌస్‌లో ఇరువురు సమావేశమయ్యారు. భారత్‌లో టెస్లా ఎంట్రీ, స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ సేవలపై చర్చించే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చిన వేళ.. ఇద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అనంతరం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను మోదీ కలవనున్నట్లు సమాచారం. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌తో భేటీ అయినట్లు ట్వీట్ చేశారు. సంస్కరణల వైపు భారత్ చేస్తున్న ప్రయత్నాల గురించి, ‘మినిమమ్ గవర్నమెంట్, మాగ్జిమమ్ గవర్నెన్స్’ను మరింత ముందుకు తీసుకెళ్లడంపై ఆయనతో మాట్లాడినట్లు తెలిపారు. స్పేస్, మొబిలిటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్ వంటి అంశాలపై కూడా చర్చించినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా, అనంతరం ప్రెసిడెంట్ ట్రంప్‌తో ఆయన భేటీ కానున్నారు.

Tags

Next Story