Ratan tata : క్రిప్టో కరెన్సీతో సంబంధం లేదన్న రతన్ టాటా

స్కామర్ల దుష్ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞ‌ప్తి

వ్యాపార దిగ్గజం రతన్ టాటా క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడుల అంశంపై స్పష్టతనిచ్చారు. క్రిప్టోతో తనకు ఏ రూపంలోనూ సంబంధం లేదని వెల్లడించారు. తనకు క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు ఉన్నాయన్న వార్తలకు నెటిజన్లు దూరంగా ఉండాలని టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ సూచించారు.

ప్రజలను మోసగించడానికే అలాంటి కథనాలు వస్తున్నాయని, ఇదంతా స్కామర్ల పనే అన్న విషయం అర్థం చేసుకోవాలన్నారు.రతన్ టాటా ట్వీట్‌పై పలువురు యూజర్ లు కూడా స్పందించారు. క్రిప్టో కరెన్సీలపై సకాలంలో తన వైఖరి తెలియజేసినందుకు టాటా కు ధన్యవాదాలు తెలిపారు. క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులతో ఇబ్బందులు కొని తెచ్చుకోవాలని భావించే వారికి ఇది చాలా ముఖ్యమనీ, స్కామ్ ల గురించి హెచ్చరించినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాం అని మరో యూజర్ రాసుకొచ్చాడు.'మీ గురించి మాకు తెలుసు. ఈ తరహా యాడ్స్, అప్లికేషన్స్ మేం ఎప్పుడు విశ్వసించం` అని పేర్కొన్నారు. `

ఇలాంటి కథనాల బాధితులు రతన్ టాటా ఒక్కరే కాదు. ఇంతకుముందు మరో పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టారంటూ ఫేక్ వార్తలు వచ్చాయి. తనకు క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు ఉన్నాయంటూ ఆన్ లైన్ లో వచ్చిన ప్రకటన చూసి ఓ వ్యక్తి తనను అప్రమత్తం చేశాడని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. ఇది ప్రమాదకర ధోరణి అని, క్రిప్టో కరెన్సీల్లో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదని అప్పట్లో ట్వీట్ చేశారు.





వర్చువల్‌ కరెన్సీగా వ్యవహరించే క్రిప్టో కరెన్సీని డిజిటల్‌ ఆస్తిగా భావిస్తారు. దీనిద్వారా పెట్టుబడులు పెట్టొచ్చు.. ఆకర్షణీయమైన లాభాలు వచ్చినప్పుడు డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇదంతా డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ ద్వారా పనిచేస్తాయి. క్రిప్టోకరెన్సీల విలువ డిమాండ్, సరఫరా ఆధారంగా మారుతూ ఉంటుంది. బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఆధారంగా క్రిప్టోకరెన్సీలు పనిచేస్తాయి. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు. బిట్‌కాయిన్, ఇథీరియమ్, డాష్, మొనెరో, రిపుల్, లైట్‌కాయిన్ అనేవి ప్రముఖ క్రిప్టో కరెన్సీలుగా కొనసాగుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story