Forest Fire: అరుణాచల్‌ ప్రదేశ్‌ అడవుల్లో కార్చిచ్చు..

Forest Fire: అరుణాచల్‌ ప్రదేశ్‌ అడవుల్లో కార్చిచ్చు..
X
మంటలార్పుతున్న భారత వాయుసేన.

అరుణాచల్‌ప్రదేశ్‌లోని లోహిత్‌ వ్యాలీ అడవుల్లో కార్చిచ్చు చెలరేగుతోంది. అడవంతా అగ్నికి ఆహుతైపోతోంది. దాంతో రంగంలోకి దిగిన భారత వైమానిక దళం మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తోంది. అందుకోసం ఎంఐ-17V5 హెలికాప్టర్‌లను మోహరించి నీళ్లు గుమ్మరిస్తోంది.

అయితే, దాదాపు 9,500 అడుగుల ఎత్తు నుంచి ఈ ఆపరేషన్‌ చేయాల్సిరావడం రెస్క్యూ టీమ్స్‌కు పెను సవాల్‌గా మారింది. అరుణాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం అభ్యర్థన మేరకు భారత వైమానిక దళం, అటవీశాఖ అధికారులు కలిసి ఈ ఆపరేషన్‌ చేపట్టారు. కార్చిచ్చుకిగల కచ్చితమైన కారణాలు ఏవీ ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.

ఈ మంటలవల్ల ప్రాణనష్టంగానీ, ఆస్తినష్టంగానీ సంభవించినట్లు ఎలాంటి వివరాలు వెల్లడికాలేవని చెప్పారు. అయితే ముందుజాగ్రత్త చర్యగా కార్చిర్చు సంభవించిన ప్రాంతానికి పరిసర గ్రామాల్లో ఉన్న ప్రజలను తాత్కాలికంగా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు. వారికి అవసరమైన వసతి ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

Tags

Next Story