Puja Khedkar: పూజా ఖేద్కర్‌ను అరెస్టు చేయకండి: ఢిల్లీ హైకోర్టు

చీటింగ్, ఫోర్జరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ మాజీ ప్రొబేషనరీ అధికారిణి పూజా ఖేడ్కర్‌కు ఢిల్లీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తక్షణ కస్టడీ అవసరం లేదంటూ ఆమెకు తాత్కాలిక ఉపశమనం కలిగింది. అరెస్టు నుంచి ఆగస్టు 21 వరకు రక్షణ కల్పించింది. ముందుస్తు బెయిల్ కోసం పూజ పిటిషన్ వేసిన నేపథ్యంలో దిల్లీ పోలీసులకు కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.
పుణెలో ట్రైనీ సహాయ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో పూజా ఖేడ్కర్‌పై అధికార దుర్వినియోగంతో పాటు యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్ పత్రాలు సమర్పించారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ ఆమెను ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది.
నకిలీ పత్రాలతో పరీక్షను క్లియర్ చేసినట్లు గుర్తించిన యూపీఎస్సీ దానిపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులిచ్చింది. ఆమెపై ఫోర్జరీ కేసు నమోదు చేయడంతో పాటు అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు దిల్లీ కోర్టు ఇదివరకే నిరాకరించింది. ఈ క్రమంలో ఆమె దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఆమెపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇవ్వడానికి తగిన సమయం ఇవ్వాలని పూజ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. ఈ క్రమంలోనే ఆమెకు ఊరట లభించింది.
ఇదిలాఉంటే.. ఢిల్లీ పోలీసులు ఇప్పటికే ఫోర్జరీ కేసులో దర్యాప్తు ప్రారంభించారు. దీని విచారణకు హాజరుకావాలని త్వరలో ఆమెకు నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక ఆమె అరెస్టు భయంతో దుబాయ్‌కి పరారైనట్లు వార్తలు వచ్చాయి. ఫోన్లు స్విచ్చాఫ్ వస్తున్నట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. గత కొద్దిరోజులుగా ఆమె ఎక్కడుందనే దానిపై ఎలాంటి సమాచారం లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com