Sanjeev Khirwar: ఐఏఎస్ అధికారి నిర్వాకం.. పెంపుడు కుక్క వాకింగ్ కోసం స్టేడియం ఖాళీ..

Sanjeev Khirwar: తన పెంపుడు కుక్కకోసం ఓ ఐఏఎస్ అధికారి ఏకంగా స్టేడియాన్నే ఖాళీ చేయించిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం రేపింది. ఎప్పుడు క్రీడాకారులప్రాక్టీస్‌తో బిజీగా ఉండే త్యాగరాజ్ స్డేడియంలో రెవెన్యూ కార్యదర్శి సంజీవ ఖిర్వార్ .. తనపెంపుడు కుక్కతో వాకింగ్ చేస్తుంటారు. అందుకోసం నిర్ణీత సమయం కంటే ముందే క్రీడాకారులను స్టేడియం నుంచి వెళ్లగొట్టాలని నిర్వాహకులకు సూచించారు సంజీవ ఖిర్వార్.
పెంపుడు కుక్కకోసం క్రీడాకారులకు, శిక్షకులకు ఆటంకం కలిగించడంపై తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. ఓ బాధ్యత కల్గిన ఐఏఎస్ అధికారి చేస్తున్న నిర్వాహకం తీవ్రచర్చనీయాంశమైంది. ఈ ఘటనపై స్పందించిన ఢిల్లీ ప్రభుత్వం రాత్రి పదిగంటల వరకు స్టేడియం అందరికి అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న కేంద్రం.. ఆ అధికారిని లద్దాఖ్‌కు బదిలీచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
సాధారణంగా త్యాగరాజ్ స్టేడియం రాత్రి 8.30 నిమిషాల వరకు నిత్యం క్రీడాకారులు, శిక్షకుల సాధనతో బిజీగాఉంటుంది. ఐఏఎస్ అధికారి సూచనలతో గత కొద్దినెలలుగా రాత్రి 7గంటలకంటే ముందే సంజీవ ఖర్వార్ కోసం ఖాళీచేయిస్తున్నారు స్టేడియం నిర్వాహకులు. అధికారి వాకింగ్ కోసం తమ సాధనకు తీవ్ర ఆటంకం కల్గుతుందని క్రీడాకారులు ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు స్పందించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com