Pratibha Shukla: టమాటాలు తినకండి.. మంత్రి సలహా

Pratibha Shukla: టమాటాలు తినకండి.. మంత్రి సలహా

దేశవ్యాప్తంగా టమాట(Tomatoes) ధరలు భగ్గుమంటున్న వేళ ఉత్తర్‌ప్రదేశ్‌ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టమాటాలు తినడం మానేయాలని(Stop Eating Tomatoes) ప్రజలకు ఉచిత సలహా ఇచ్చారు. టమాటాలు తినడం మానేయాలని బీజేపీ నేత, ఉత్తరప్రదేశ్‌ మహిళా అభివృద్ధి, శిశు పోషకాహార శాఖ సహాయ మంత్రి( UP Minister) ప్రతిభా శుక్లా(Pratibha Shukla) ప్రజలకు సూచించారు. అందరూ టమాటాలు తినడం మానేస్తేనే వాటి ధరలు‍(tomato prices) దిగివస్తాయని కూడా వ్యాఖ్యానించారు. టమాటాలను ఇంట్లోనే పండించుకోవాలని... కూరల్లో వాటి బదులుగా నిమ్మకాయలను వాడుకోవాలని ప్రతిభా సూచించారు.


పశ్చిమబెంగాల్‌ మంత్రి వ్యాఖ్యలపై సామాన్యులు, ప్రతిపక్ష నేతలు భగ్గుమన్నారు. బాధ్యత గల హోదాలో ఉన్న ఆమె ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. సమస్యలను పరిష్కరించడంలో చిట్టచివరన ఉండే బీజేపీ నేతలు, ఉచిత సలహాలు ఇవ్వడంలో మాత్రం ముందుంటారని విపక్ష నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ధరలను అదుపు చేయడంలో విఫలమైన బీజేపీ ప్రభుత్వం చౌకబారు సలహాలు ఇస్తోందని విమర్శిస్తున్నారు.

2019లోనూ అప్పటి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అప్పట్లో భగ్గుమంటున్న ఉల్లిపాయల ధరలపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఉల్లిపాయలు తినొద్దని, తమ ఇంట్లోనూ వాటిని వాడటం లేదని... తినడం మానేస్తేనే ధరలు కిందికి దిగి వస్తాయని ప్రజలకు సూచించారు. ఈ వ్యాఖ్యలపై ప్రజలు భగ్గుమన్నారు.


దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటడంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పందించింది. ఢిల్లీ తదితర ప్రాంతాల్లో సబ్సిడీపై టమాటా సరఫరా చేస్తోన్న కేంద్రం.... మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ నుంచి కొత్త పంట అధికంగా మార్కెట్లోకి సరఫరా అయితేనే ధరలు తగ్గుతాయని పేర్కొంది. టమాటా సహా 22 నిత్యావసరాల ధరలను వినియోగదారుల వ్యవహారాల శాఖ పర్యవేక్షిస్తోందని పశ్చిమబెంగాల్‌ ప్రజాపంపిణీ శాఖ మంత్రి అశ్విని కుమార్ చౌబే వెల్లడించారు. నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (NCCF), నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ (NAFED)లు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని మండీల నుంచి టమాటాలను నిరంతరం సేకరిస్తున్నాయని, వినియోగదారులకు రాయితీ ఇచ్చిన తర్వాత వాటిని ఢిల్లీ-NCR, బీహార్, రాజస్థాన్‌లోని ప్రధాన వినియోగ కేంద్రాలలో సరసమైన ధరలకు అందుబాటులో ఉంచుతున్నాయని చౌబే చెప్పారు.

టమాటా ధరల పెరుగుదలకు సంబంధించి రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ సహాయ మంత్రి అశ్వినీ చౌబే లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మహారాష్ట్రలోని నాసిక్, నార్యంగావ్, ఔరంగాబాద్‌ బెల్ట్‌తో పాటు మధ్యప్రదేశ్ నుంచి కొత్త పంట భారీగా సరఫరా జరిగితేనే టమాటా ధరలు దిగివస్తాయని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story