'నేను బతికే ఉన్నాను, కానీ ప్రతిరోజూ చనిపోతున్నా: విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి..

నేను బతికే ఉన్నాను, కానీ ప్రతిరోజూ చనిపోతున్నా: విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి..
X
జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 241 మంది మృతి చెందారు. ఆ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేష్ ఇప్పటికీ శారీరకంగా మరియు మానసికంగా ఎంతో బాధపడుతున్నాడు.

జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా అత్యంత విషాదకర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం 241 మంది మృతి చెందారు. ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేష్ ఇప్పటికీ శారీరకంగా మరియు మానసికంగా బాధపడుతున్నాడు. "నా సోదరుడు చనిపోయాడు, జీవితం స్తంభించిపోయింది. నేను ఇక ఎవరితోనూ మాట్లాడను, నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను" అని ఆయన జాతీయ మీడియాతో అన్నారు. ప్రమాదం జరిగినప్పటి నుండి అతని కుటుంబం, వ్యాపారం, జీవితం అన్నీ చిన్నాభిన్నమయ్యాయి.

లండన్ వెళ్తున్న AI-171 విమానం శిథిలాల నుండి బయటకు వస్తున్నట్లు కనిపించిన విశ్వాస్ కుమార్, తాను ఇప్పుడు ఒంటరిగా నివసిస్తున్నానని, తన భార్య మరియు కొడుకుతో మాట్లాడడం లేదని తెలిపాడు.

రమేష్ మాట్లాడుతూ, కొన్ని సీట్ల దూరంలో కూర్చున్న తన తమ్ముడు అజయ్ ప్రమాదంలో మరణించాడని చెప్పాడు. కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటూ రమేష్ ఇలా ఇలా అన్నాడు, "నేను ఒక్కడినే బతికి ఉన్నాను, ఇంకా నమ్మలేకపోతున్నాను. ఇది ఒక అద్భుతం లాంటిది కాదు. నా సోదరుడు నాకు వెన్నెముక, అతను ఎల్లప్పుడూ నాకు మద్దతు ఇచ్చాడు. ఇప్పుడు నేను పూర్తిగా ఒంటరిగా ఉన్నాను."

"నేనే ఎవరితోనూ మాట్లాడను"

రమేష్ మాట్లాడుతూ, తాను పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD) తో బాధపడుతున్నానని, ఇంతవరకు చికిత్స ప్రారంభించలేదని అన్నారు. "ఇది నాకు, నా కుటుంబానికి చాలా కష్టం. నా తల్లి ప్రతిరోజూ తలుపు బయట కూర్చుంటుంది, ఎవరితోనూ మాట్లాడదు. నేను రాత్రంతా నొప్పితో బాధపడుతున్నాను" అని ఆయన అన్నారు.

విమానం విరిగిన భాగం గుండా సీటు 11A నుండి బయటకు నెట్టబడుతున్నప్పుడు తనకు కాలు, భుజం, మోకాలు, వీపుకు తీవ్ర గాయాలయ్యాయని, దీనివల్ల తాను పని చేయలేకపోతున్నానని అన్నారు. నెమ్మదిగా నడుస్తున్నానని, తన భార్య తనకు మద్దతు ఇస్తుందని చెప్పారు.

కమ్యూనిటీ నాయకుడు సంజీవ్ పటేల్ మాట్లాడుతూ, "అతను మానసికంగ, శారీరకంగా, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఈ ప్రమాదం అతని కుటుంబాన్ని మొత్తం నాశనం చేసింది. బాధ్యులు బాధితులను కలుసుకుని వారి మాట వినాలి.

ప్రమాదం తర్వాత వ్యాపారం కూడా నిలిచిపోయింది.

ప్రమాదం జరిగినప్పటి నుండి రమేష్ మరియు అతని సోదరుడు డామన్ మరియు డయ్యూలో నడుపుతున్న కుటుంబ చేపల వ్యాపారం నిలిచిపోయింది. ఎయిర్ ఇండియా అధికారులు ముందుకు వచ్చి అతనితో మాట్లాడాలి, తద్వారా బాధ తగ్గుతుంది" అని ఆయన అన్నారు.

ప్రస్తుతం టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా, దాని సీనియర్ అధికారులు బాధితుల కుటుంబాలతో క్రమం తప్పకుండా సమావేశమవుతున్నారని చెప్పారు.

ఎయిర్ ఇండియా రమేష్ కు సుమారు ₹25.09 లక్షలు తాత్కాలిక పరిహారాన్ని అందించింది.

Tags

Next Story