DELHI RAINS: జల దిగ్బంధంలోనే ఢిల్లీ.. హిమాచల్‌లో మళ్లీ భారీ వర్షాలు

DELHI RAINS: జల దిగ్బంధంలోనే ఢిల్లీ.. హిమాచల్‌లో మళ్లీ భారీ వర్షాలు
ఇంకా జల దిగ్బంధంలోనే ఢిల్లీలోని చాలా ప్రాంతాలు... క్రమంగా తగ్గుముఖం పడుతున్న యమునా నది వరద.... హిమాచల్‌లో మళ్లీ కుండపోత

యమునా నది‍(yamuna river) మహోగ్రరూపంతో దేశ రాజధాని ఢిల్లీ(delhi rains) లోని చాలాప్రాంతాలు ఇంకా వరద దిగ్బంధంలోనే ఉన్నాయి. ఎర్రకోట(red fort), రాజ్ ఘాట్ , యమునానగర్ , జమునానగర్ , ITO, హనుమాన్ మందిర్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరదనీరు నిలిచి ఉంది. రాజ్ ఘాట్(raj ghaT‌) పూర్తిగా వరదలోనే ఉంది.


మరోవైపు యమునా నది నిన్నటి నుంచి శాంతించింది. క్రమంగా నదీలో వరద‍(floods) ఉద్ధృతి తగ్గుముఖ పడుతోంది. ఈ ఉదయం 9గంటలకు 207.98 మీటర్ల ఎత్తున ప్రవాహం కొనసాగుతున్నట్లు కేంద్ర జలసంఘం ప్రకటించింది. మరో 12గంటల్లో ఢిల్లీ ప్రజలకు ఉపశమనం కలగనుందని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి తెలిపారు. హరియాణాలోని హత్నికుండ్ బ్యారేజ్ నుంచి దిల్లీకి పెద్దమొత్తంలో నీటిని ఎందుకు విడుదల చేశారో పెద్ద ప్రశ్నగా మారిందన్నారు. హరియాణా, ఉత్తర్ ప్రదేశ్ కెనాళ్లకు చుక్కనీరు ఎందుకు విడుదల చేయకపోవటంపై అతిషి అనుమానం వ్యక్తం చేశారు. అందుకు హరియాణా ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.


హిమాచల్ ప్రదేశ్‌‍(himachal rains)లో మళ్లీ భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. మనాలి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి పెద్దపెద్ద చెట్లు నేలకొరిగాయి. నదీపరివాహక ప్రాంతాల్లో పెద్దఎత్తున రోడ్లు కోతకు గురయ్యాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. గత వారం కురిసిన భారీ నుంచి అతి భారీవర్షాలకు కొండ చరియలు విరిగిపడటంతోపాటు ఆకస్మిక వరదలు పోటెత్తాయి. పెద్దఎత్తున రహదారులు దెబ్బతినటంతోపాటు మౌలిక సదుపాయాలకు తీవ్రంగా నష్టం జరిగినట్లు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ తెలిపారు. సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు తాత్కాలిక సాయంగా 2వేల సాయం ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.


గతంలో కురిసన భారీ వర్షాలు, వరదల ధాటికి హిమాచల్‌లో భారీగా ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించింది. వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. భారీ వర్షాలకు హిమాచల్‌ ప్రదేశ్‌లో నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. రావి, బియాస్, సట్లేజ్, స్వాన్, చీనాబ్‌తో సహా అన్ని ప్రధాన నదులు ఉప్పొంగుతున్నాయి.


భారీ రాళ్లు, పెద్దపెద్ద దుంగలు ఈ వరదలో కొట్టుకుపోయాయి. సున్ని ప్రాంతంలో సట్లెజ్‌ నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. వంతెనను తాకుతూ వరద ప్రవహిస్తుండడం వల్ల పరిసర ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మండీలోని పంచవక్ర్త ఆలయంలో నీటిలో మునిగిపోయింది. ప్రవాహం గంటగంటకూ పెరుగుతుండడం వల్ల స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. విక్టోరియా బ్రిడ్డీను తాకుతూ వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది..

Tags

Read MoreRead Less
Next Story