Bharat Ratna: ఒకే ఏడాదిలో ఐదుగురికి భారతరత్న ఇచ్చిన మోదీ సర్కార్

దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, మరో మాజీ ప్రధాని చౌధరీ చరణ్‌సింగ్‌తోపాటు వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్‌కు కేంద్రం భారతరత్న ప్రకటించింది.సాధారణంగా ఏడాదిలో కేవలం ముగ్గురికే భారతరత్న అవార్డు ప్రకటిస్తారు. కానీ...మోదీ సర్కార్ ఆ రికార్డ్‌ని బ్రేక్ చేసింది. ఈ ఏడాది ఇప్పటికే బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌తోపాటు భాజపా కురు వృద్ధుడు లాల్‌కృష్ణ అడ్వాణీకి ఇప్పటికే ఈ పురస్కారం ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మరో ముగ్గురికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డ్ ప్రకటించింది. వారిలో ఇద్దరు మాజీ ప్రధానులు పీవీ నర్సింహారావు, చౌధరీ చరణ్‌సింగ్ కాగా మరొకరు ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత డాక్టర్ స్వామినాథన్ ఉన్నారు. చనిపోయిన తర్వాత ఈ ముగ్గురికి భారతరత్న లభించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఓ ప్రకటన చేశారు. ప్రముఖ మేధావి, రాజనీతిజ్ఞుడైన పీవీ నర్సింహారావు...వివిధ హోదాల్లో దేశానికి సేవలందించారని ప్రధాని మోదీ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా, కేంద్రమంత్రిగా, అనేక ఏళ్లపాటు ఎంపీగా, ఎమ్మెల్యేగా చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపించటంలో పీవీ దార్శనిక నాయకత్వం కీలకపాత్ర పోషించినట్లు ప్రధాని మోదీ కొనియాడారు. దేశ శ్రేయస్సుతోపాటు అభివృద్ధికి గట్టి పునాది వేసినట్లు పేర్కొన్నారు. పీవీ నర్సింహారావు క్లిష్టమైన పరివర్తిన ద్వారా దేశాన్ని ముందుకు నడపటంతోపాటు దేశ సాంస్కృతిక, మేధో వారసత్వాన్ని సుసంపన్నం చేశారని...ప్రధాని మోదీ ప్రశంసించారు.
మాజీ ప్రధాని చౌదరీ చరణ్‌సింగ్ దేశానికి అసమాన సేవలు అందించారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం...ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్‌కు...భారతరత్న అవార్డ్ ప్రకటించటం ఎంతో సంతోషించదగ్గ విషయమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి, రైతుల సంక్షేమానికి...చిరస్మరణీయ సేవలు అందించారని ప్రశంసించారు. దేశం వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి సాధించటంలో స్వామినాథన్ కీలకపాత్ర పోషించటంతోపాటు ఆధునీకరణకు విశేషంగా కృషి చేసినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆవిష్కర్తగా, గురువుగా, విద్యార్థుల్లో అభ్యాసం, పరిశోధనల దిశగా ప్రోత్సహించారని పేర్కొన్నారు. డాక్టర్ స్వామినాథన్ దార్శానిక నాయకత్వం వ్యవసాయ రంగాన్ని పరివర్తన దిశగా తీసుకెళ్లటమే కాకుండా
దేశ ఆహారభద్రతతోపాటు శ్రేయస్సుకు తోడ్పాటు అందించినట్లు ప్రధాని మోదీ కొనియాడారు. తనకు బాగా తెలిసిన వ్యక్తి మాత్రమే కాకుండా ఆయన ఆలోచనలకు తాను ఎంతో విలువిస్తానని ప్రధాని మోదీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఇప్పటికే బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌తోపాటు భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు లాల్‌కృష్ణ అడ్వాణీకి కూడా భారతరత్న ప్రకటించింది
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

