Billboard Collapse: ముంబై హోర్డింగ్ ఓన‌ర్‌ను ప‌ట్టుకునేందుకు భారీ ప్రణాళికా

Billboard Collapse:   ముంబై హోర్డింగ్ ఓన‌ర్‌ను ప‌ట్టుకునేందుకు భారీ ప్రణాళికా
X
చివరికెలా చిక్కాడంటే?

ముంబైలో భారీ బిల్‌బోర్డు కూలిన ఘ‌ట‌న‌లో 16 మంది మృతిచెందిన విష‌యం తెలిసిందే. దుమ్ము తుఫాన్ రావ‌డం వ‌ల్ల ఆ భారీ ఓర్డింగ్ ఓ పెట్రోల్ పంపుపై కూలింది. అయితే ఆ హోర్డింగ్ పెట్టింది ఈగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఆ కంపెనీ ఓన‌ర్ భ‌వేశ్ భిండే. అయితే అత‌ను గ‌త మూడు రోజుల నుంచి పోలీసుల‌కు చిక్క‌కుండా తిరుగుతున్నాడు. కానీ ఎట్ట‌కేల‌కు ఉద‌య్‌పూర్‌లో ఆ హోర్డింగ్ ఓన‌ర్‌ను ప‌ట్టుకున్నారు. దీని కోసం వాళ్లు చాలా సీక్రెట్ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు.

120 ఫీట్ల ఎత్తున్న బిల్‌బోర్డు కూల‌డం వ‌ల్ల 16 మంది మృతిచెంద‌గా, మ‌రో 75 మంది గాయ‌ప‌డ్డారు. ఈ ప్ర‌మాదం జ‌రిగిన రోజే ఆ హోర్డింగ్ ఓన‌ర్ ప‌రారీ అయ్యాడు. భ‌వేశ్ గురించి ముంబై పోలీసులు అన్వేషించారు. ఉద‌య్‌పూర్‌లో ఉన్న‌ట్లు తెలుసుకుని ఓ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. స్థానిక పోలీసుల‌కు చెప్ప‌కుండానే వాళ్లు భ‌వేశ్‌ను ఆధీనంలోకి తీసుకున్నారు.

తొలుత లోనావాలా వెళ్లాడు. అక్క‌డ నుంచి థానే. ఆ త‌ర్వాత అహ్మాదాబాద్ వెళ్లాడు. మ‌ళ్లీ అక్క‌డ నుంచి అత‌ను ఉద‌య్‌పూర్ చేరుకున్నాడు. అక్క‌డ ఓ హోట‌ల్‌లో అత‌ను మ‌రో పేరుతో దాక్కుకున్న‌ట్లు గుర్తించారు. ఆచూకీ తెలుసుకుని వెళ్లేలోగా.. అత‌ను కొత్త సిటీకి పరారీ అయ్యేవాడు. భ‌వేశ్‌ను పట్టుకునేందుకు ముంబై పోలీసులు 8 బృందాలుగా మారి అన్వేషించారు. క్రైం బ్రాంచ్ పోలీసుల‌కు అత‌ను చిక్కాడు.

Tags

Next Story