IAF: భారత వాయుసేనా.. మజాకా

IAF: భారత వాయుసేనా.. మజాకా
X
హెలికాఫ్టర్‌తో హెలికాఫ్టర్‌ ఎయిర్‌ లిఫ్ట్‌... అత్యంత ప్రతికూల వాతావరణం మధ్య సాహసోపేత ఆపరేషన్‌... విశ్వవ్యాప్తమైన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్ సత్తా

అసాధ్యాన్ని సుసాధ్యం చేసి భారత వాయు సేన(Indian Air Force) సత్తా చాటింది. సరిహద్దుల్లో కవ్విస్తున్న దాయాది దేశానికి, రెచ్చగొడుతున్న డ్రాగన్‌కు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ బలమేంటో చూపించింది. అత్యంత ప్రతికూల పరిస్థితుల మధ్య, అతిపెద్ద సవాల్‌ను అతి సునాయసంగా నిర్వహించి ఔరా అనిపించింది. గగనతలంలో తమ సామర్థ్యం ఇదని... మాతో పెట్టుకోవద్దని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది.

విపత్తుల సమయాల్లో హెలికాప్టర్‌( helicopter) ద్వారా మనుషులు, వస్తువులను ఎయిర్‌ లిఫ్ట్‌(Airlifts ) చేయటం మనం టీవీల్లోనూ... ప్రత్యక్షంగానూ చూస్తుంటాం. కానీ ఎప్పుడైనా ఓ హెలికాప్టర్‌ను మరో హెలికాప్టర్‌ ఎయిర్‌ లిఫ్ట్‌ చేయటం చూశామా... చూడలేదు కదూ ఆ సాహసాన్ని ఇండియా ఎయిర్‌ఫోర్స్‌( IAF) చేసి చూపించింది. కొన్ని వేల మీటర్ల ఎత్తు నుంచి అత్యంత ప్రతికూలమైన భౌగోళిక పరిస్థితుల మధ్య హెలికాఫ్టర్‌ను ఎయిర్‌లిఫ్ట్ చేసింది. వాయుసేన అత్యంత క్లిష్టమైన, సవాల్‌తో కూడుకున్న ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేసి ఔరా అనిపించింది.


జమ్ముకశ్మీర్‌(Jammu and Kashmir )లో గతనెల ఒకటో తేదీ నుంచి అమర్‌నాథ్ యాత్ర( Amarnath Yatra) ప్రారంభమైంది. అత్యంత ప్రతికూల పరిస్థితుల మధ్య సాగే ఈ యాత్రను దృష్టిలో ఉంచుకొని హెలికాప్టర్‌ సేవలను అందుబాటులోకి తెచ్చారు. అయితే అమర్‌నాథ్‌ యాత్రికులను తరలించే ఓ ప్రైవేటు హెలికాప్టర్‌( stranded helicopter) సాంకేతిక సమస్యతో పంచతరణి హెలిప్యాడ్‌లో నిలిచిపోయింది. దీనివల్ల హెలికాప్టర్‌ సేవలు నిలిచిపోయాయి.

అమర్‌నాథ్‌ దేవస్థానం( Amarnath Shrine) సమీపంలో కొన్నివేల మీటర్ల ఎత్తులో ఉన్న పంచతరణి( Panchtarni) హెలిప్యాడ్‌ వద్ద నిలిచిపోయిన హెలికాప్టర్‌ను తరలించేందుకు వాయుసేన అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌ చేపట్టింది. భక్తులను తరలించే AS-350 ప్రైవేటు హెలికాప్టర్‌ను ఎంఐ-17 రవాణా హెలికాప్టర్‌( Mi-17 V5 helicopter) ఎయిర్‌ లిఫ్ట్‌ చేసింది. 11వేల 5వందల మీటర్ల ఎత్తు( 11,500 feet) నుంచి నిటారుగా ఉన్న పర్వతాలు, ఇరుకైన లోయలతో అత్యంత ప్రతికూల పరిస్థితుల మధ్య పైలెట్‌ ఎంతో నైపుణ్యంతో చిన్న పొరపాటు కూడా దొర్లకుండా ప్రైవేటు హెలికాప్టర్‌ను ఎయిర్‌ లిఫ్ట్‌ చేసినట్లు వాయుసేన ప్రకటించింది.


తమ బృందం పక్కా ప్రణాళిక, క్రమబద్ధమైన సన్నద్ధత, అసాధారణమైన ఫ్లయింగ్‌ నైపుణ్యాలతో ప్రైవేటు హెలికాప్టర్‌ను ఎయిర్‌లిఫ్ట్‌ చేసినట్లు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ సగర్వంగా ప్రకటించింది. ప్రైవేటు హెలికాప్టర్‌ను వాయుసేన హెలికాప్టర్‌ లిఫ్ట్ చేస్తున్న దృశ్యాలు అబ్బురపరిచాయి. పాడైన హెలికాప్టర్‌ను తరలించటంతో హెలికాప్టర్‌ సేవలు తిరిగి ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు.

Tags

Next Story