Manipur : మణిపూర్‌లో మరో దారుణం.. కిడ్నాప్ అయిన ఇద్దరు విద్యార్థుల హత్య..

Manipur : మణిపూర్‌లో మరో దారుణం.. కిడ్నాప్ అయిన ఇద్దరు విద్యార్థుల హత్య..
వైరల్ అయిన ఫోటోల్లో సాయుధ బృందం

మణిపూర్‌లో హింస ఇంకా కొనసాగుతూనే ఉంది. జులైలో అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు హత్యకు గురైన ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. మెయిటీ తెగకు చెందిన ఇద్దరు విద్యార్థులు హిజమ్ లింతోయింగంబి , ఫిజమ్ హెమిజిట్ లు ఓ అటవీ క్యాంపులో గడ్డిపై కూర్చుండగా వెనక దూరంలో సాయుధులు నిల్చున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక రెండవ ఫొటోలో వారిద్దరూ చనిపోయి నేలపై పడి ఉన్నారు.

ఈ ఫొటోలు వెలుగులోకి రావడంతో మరోమారు ప్రభుత్వంపై నిరసనలు వెల్లువెత్తాయి. ఈ కేసును ఇప్పటికే పర్యవేక్షిస్తున్న సీబీఐ వారి జాడను గుర్తించడంలో విఫలమైందంటూ కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు ప్రారంభమైన కొన్ని రోజులకే సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్ అయిన 47 ఏళ్ల సమరేంద్ర సింగ్‌ కనిపించకుండా పోయారు. ఘటనలకు సంబంధించిన వార్తలు కవర్ చేసేందుకు సమరేంద్ర సింగ్.. కాంగ్‌పోక్పీ ప్రాంతం వైపు వెళ్లాడని.. అప్పటి నుంచి వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తున్నాయని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.


పరిస్థితులు అదుపులోకి వచ్చాయని భావించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జులై 6 వ తేదీన మణిపూర్‌లో కొన్ని ఆంక్షలను సడలించారు. కానీ ఆ తరువాత నీట్ కోచింగ్ కోసం ఇంటి నుంచి వెళ్లిన 17 ఏళ్ల హిజామ్ లువాంగ్బీ, ఆమె స్నేహితుడు కనపడకుండా పోయారు. అయితే వీరందరు మిస్సింగ్ కావడం వెనక ఒక్కో రికీ ఒక్కో కారణం ఉందని అందరూ భావిస్తూ వచ్చారు. అయితే హత్యకు గురైన ఈ ఇద్దరు విద్యార్తులు జులైలో ఓ షాపులో వద్దనున్న సీసీటీవీ కెమెరాల్లో కనిపించారు. ఆ తర్వాతి నుంచి వారి జాడ కనిపించలేదు. వారు హత్యకు గురైన ఫొటోలు వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై వేగంగా నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామని తెలిపింది. విద్యార్థుల కిడ్నాప్, హత్య వెనక ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించింది. ప్రజలు సంయమనం పాటించాలని, దర్యాప్తు సంస్థలను వాటి పని చెయ్యనివ్వాలని కోరింది.

Tags

Read MoreRead Less
Next Story