NCP poster War: ఎన్సీపీ కట్టప్ప పోస్టర్

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలను అజిత్ పవార్ తన గుప్పిట్లో పెట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో పార్టీ పై తన నియంత్రణను నిలుపుకోవడం కోసం శరద్ పవర్ పెద్ద పోరాటమే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీకి చెందిన నేషనలిస్ట్ స్టూడెంట్ కాంగ్రెస్ ఢిల్లీలో పోస్టర్లు వేసింది. ఈ పోస్టర్లలో అజిత్ పవార్ ను బాహుబలి సినిమాలో కట్టప్ప గా చూపింది.
బుధవారం ముంబైలో జరిగిన సమావేశంలో అజిత్ పవార్, శరద్ పవార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పుడు అజిత్ పవార్ కూడా పార్టీ పేరు, చిహ్నంపై దావా వేశారు. అజిత్ ను అడ్డుకునే పనిలో నిమగ్నమైన ఉన్న శరద్ పవార్, ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని పిలిచారు. ఈ సమావేశానికి ముందే ఎన్సీపీ యువజన విభాగం ఢిల్లీలో పలు పోస్టర్లు వేసింది. ఈ పోస్టర్లలో అజిత్ పవార్ ను ‘బాహుబలి’ సినిమా కటప్ప లా అభివర్ణించారు.
అంతే కాదు.. ఆ పోస్టర్ లో '‘దేశం మొత్తం తమ ప్రజల మధ్య దాగి ఉన్న ద్రోహులను చూస్తోంది. ఇలాంటి బూటకపు దొంగలను ప్రజలు క్షమించరు' అని రాసి ఉంది.. దీనికి గద్దర్ అంటే ద్రోహి అనే హ్యాష్ టాగ్ ఇచ్చారు. ఇంకో పోస్టర్ లో ‘సత్యం, అసత్యం మధ్య జరిగే పోరాటంలో దేశం మొత్తం శరద్ పవార్ సాహెబ్‌కు అండగా నిలుస్తుంది’ అని రాసి ఉంది. ఎన్సీపీలోని రెండు వర్గాలు పార్టీ గుర్తు, పేరుపై తమ వాదనను వినిపించాయి. అజిత్ పవార్ మరో అడుగు ముందుకేసి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. పోస్టర్లను ఎన్సీపీ విద్యార్థి విభాగం ఏర్పాటు చేసింది. దీని అధ్యక్షులు సోనియా దుహాన్, శరద్ పవార్ సన్నిహితులలో ఒకరు. ప్రస్తుతానికి ఈ పోస్టర్ లను తొలగించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com