కర్నాటక సీఎం సిద్దరామయ్యే..

కర్నాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ఫైనల్ చేసింది. ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పేరును ఖరారు చేసింది. ఈ నెల 20న బెంగళూరులో మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు విశ్వనీయ సమాచారం. ఇవాళ సాయంత్రం జరిగే సీఎల్పీ సమావేశంలో... సిద్దరామయ్య పేరును అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. సిద్ధరామయ్యను సీఎం చేసే విషయంలో హైకమాండ్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది.
డీకే శివకుమార్‌ను బుజ్జగించి దారికి తెచ్చుకున్నట్లుగా తెలుస్తోంది. సిద్దరామయ్యకున్న క్లీన్ ఇమేజ్, అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయనకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం మొదటి నుంచి అనుకుంటోంది. ఆ దిశగానే కసరత్తు చేసింది. రాహుల్ గాంధీ ఇద్దరు నేతలతో విడివిడిగా చర్చలు జరిపారు.. సిద్దరామయ్యకు ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నట్లుగా డీకే శివకుమార్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. శనివారం బెంగళూరులోని జరగనున్న కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రమాణ స్వీకారానికి ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు, కీలక నేతలను పిలవాలని నిర్ణయిచింది కాంగ్రెస్ అధిష్ఠానం. తమిళనాడు సీఎం స్టాలిన్, బెంగాల్ సీఎం మమత బెనర్జీ, తెలంగాణ సీఎ సహా పలువురు కీలక నేతలను పిలవనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com