DRDO: బంకర్-బస్టర్ బాంబుల తయారీ దిశగా భారత్ అడుగులు..

DRDO: బంకర్-బస్టర్ బాంబుల తయారీ దిశగా  భారత్ అడుగులు..
X
భూగర్భ లక్ష్యాలను ఛేదించగల శక్తివంతమైన క్షిపణి

జూన్ 22న అమెరికా తన B-2 బాంబర్ విమానాల నుంచి ఇరాన్‌లోని ఫోర్డో అణు కర్మాగారంపై బంకర్-బస్టర్ (GBU-57/A మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్స్) బాంబులను జారవిడిచిన విషయం తెలిసిందే. ఈ వైమానిక దాడిలో ఇరాన్ కి చెందిన ప్రధాన అణు కర్మాగారం తీవ్రంగా ధ్వంసమైంది. వాస్తవానికి, ఇరాన్ పర్వతాల మధ్య భూమికి100 మీటర్ల లోతులో ఫోర్డో అణు కర్మాగారాన్ని నిర్మించింది. ఇది సాధారణ బాంబుల ద్వారా దెబ్బతినే అవకాశమే లేదు. అందుకే అమెరికా ఈ అణు కర్మాగారంపై బంకర్-బస్టర్ బాంబులను వేయాలని నిర్ణయించుకుంది. ఈ బాంబులు 60 నుంచి 70 మీటర్ల రంధ్రం చేస్తే.. భూమిలోకి చొచ్చుకుపోయాయి. ఆపై పెద్ద శబ్ధంతో పేలిపోతాయాయి. అంటే, ఈ బాంబులను శత్రువులకు చెందిన భూగర్భ బంకర్లను ఈజీగా నాశనం చేస్తాయి.

అందుకే భారత్ కూడా అధునాతన బంకర్-బస్టర్ బాంబులను తయారు చేసేందుకు ప్రయత్నాలను వేగవంతం చేసింది. బంకర్-బస్టర్ సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం తన ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నట్లు తెలిపాయి. భూగర్భ లక్ష్యాలను ఛేదించగల శక్తివంతమైన కొత్త క్షిపణి వ్యవస్థను నిర్మించడం ద్వారా భారత్‌ భవిష్యత్ యుద్ధాలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ అగ్ని-5 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి సంస్కరణను అభివృద్ధి చేస్తోంది. ఇది 5,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిని కలిగి ఉంటుంది. అయితే ప్రస్తుతం రూపొందించనున్న కొత్త వేరియంట్ 7500 కిలోగ్రాముల భారీ బంకర్-బస్టర్ వార్‌హెడ్‌ను మోయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. డీఆర్‌డీఓ తయారు చేసే క్షిపణి 80 నుంచి 100 మీటర్ల వరకు భూమిలోకి చొచ్చుకుపోయి ధ్వంసం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Tags

Next Story