INDIA Alliance : పార్లమెంట్ ఆవరణలో విపక్ష సభ్యుల ఆందోళన

రోగ్య, జీవిత బీమా పాలసీలపై ఉన్న 18 శాతం జీఎస్టీని తగ్గించాలని కోరుతూ విపక్ష ఇండియా కూటమి సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ (మంగళవారం) పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ముందు ఆందోళన చేశారు. పార్లమెంట్ భవనం మకర ద్వారం ముందు ప్లకార్డులు పట్టుకోని నిరసన చేశారు. ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై ఉన్న 18 శాతం జీఎస్టీని వెనక్కి తీసుకోవాలని వెల్లడించారు.
కాగా, టీఎంసీ నేత డెరిక్ ఒబ్రెయిన్ ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తారు. అధిక పన్ను ప్రజలకు భారంగా మారుతుందన్నారు. అలాగే, రాజ్యసభలో జీరో అవర్‌లో ఆయన మాట్లడుతూ.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఇదే రకమైన డిమాండ్ చేసినట్లు ఆయన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి రాసిన లేఖలో వెల్లడించారు. ఇండియాలో ఇన్సూరెన్స్ కేవలం 4 శాతమే ఉంది.. ప్రపంచవ్యాప్తంగా అది ఏడు శాతంగా ఉందన్నారు.. బీమా రంగంలో అసమానతలు పెరిగిపోతున్నాయి.. 75 శాతం జీవిత బీమా పాలసీలు ఉన్నాయి.. మరో 25 శాతం వైద్య పాలసీలు ఉన్నట్లు టీఎంసీ నేత ఒబ్రెయిన్ పేర్కొన్నారు. అయితే, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై చెల్లించే జీఎస్టీని తొలగించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు నితిన్ గడ్కరీ కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రికి ఇటీవలే లేఖ రాశారు. నాగ్‌పూర్ డివిజనల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి వచ్చిన మెమోరాండం ప్రకారం లేఖ రాస్తున్నట్లు గడ్కరీ వెల్లడించారు.
‘యూనియన్ లేవనెత్తిన ప్రధాన సమస్య లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీ ఉపసంహరణకు సంబంధించినది. ఈ రెండింటిపై 18 శాతం పన్ను ఉంది. జీవిత బీమా ప్రీమియంపై జిఎస్టీ విధించడం అనేది అనిశ్చితిపై పన్ను విధించడం కిందకే వస్తుంది. కుటుంబానికి కొంత రక్షణ కల్పించడానికి తీసుకునే జీవిత బీమాపై పన్ను విధించకూడదని యూనియన్ భావిస్తోంది. అదేవిధంగా, వైద్య బీమా ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ అనేది సమంజసం కాదు. సామాజికంగా అవసరమైన ఈ విభాగం వ్యాపార వృద్ధికి అడ్డంకిగా మారుతోంది. అందుకే వీటిపై జీఎస్టీని ఉపసంహరించుకోవాలని యూనియన్ కోరుతోంది’ అని నితిన్ గడ్కరీ తన లేఖలో వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com