NDIA Alliance: రేపే ఇండియా కూటమి సమావేశం

NDIA Alliance: రేపే  ఇండియా కూటమి సమావేశం
డుమ్మా కొట్టనున్న నితీష్, మమతా ?

తాాజా ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ను గట్టి దెబ్బనే కొట్టాయి. వీటి ప్రభావం ఇండియా కూటమి మీద కూడా పడుతున్నాయి. తాజాగా కూటమి మీటింగ్ కు నితీష్ హాజకు కావడం లేదని ప్రకటించారు. విపక్ష ఇండియా కూటమి నాయకులు ఈ నెల 6న ఢిల్లీలోని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో సమావేశం కావాలని నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనే వ్యూహాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడి కావడంతో వాటి ఆధారంగా ఇండియా కూటమి తన వ్యూహాలకు పదును పెట్టే అవకాశం కనిపిస్తున్నది. అయితే కూటమి కూడా బీటలు వారుతున్నట్టు కనిపిస్తోంది. దీనికి నిదర్శనమే ఢిల్లీలోని మల్లికార్జున ఖర్గే నివాసంలో రేపు జరగనున్న ఇండియా కూటమికి బీహార్ ఛీఫ్ మినిస్టర్ నితీష్ హాజరు కావటం లేదు అన్న సమాచారం. ప్రాంతీయ పార్టీల మధ్య సీట్ల సంపకంపై సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉన్నది. సీట్ల పంపకాన్ని త్వరగా ఖరారు చేయాలని తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆప్‌, సమాజ్‌వాదీ లాంటి పార్టీలు కోరినా అసెంబ్లీ ఎన్నికల వల్ల అది వాయిదా పడింది.

రేపు ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి సమావేశం జరగనుంది. దీనికి కూటమిలోని పార్టీల పెద్దలందరినీ బుధవారం ఢిల్లీకి రావాలని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే వ్యక్తిగతంగా చెప్పినట్టు సమాచారం. అయితే ఇప్పుడు ఈ మీటింగ్ కే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హాజరు కావడం లేదు. ఆయనకు బదులు జేడీయూ ఛీఫ్ లలన్ సింగ్, బీహార్ వాటర్ రిసోర్స్ మంత్రి సంజయ్ కుమార్ ఝా వెళతారని తెలుస్తోంది. మరోవైపు అసలు ఈ మీటింగ్ గురించే నాకు తెలియదు అంటున్నారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ. అసలు నాకు ఆ మీటింగ్ గురించే తనకు తెలియదని…అందుకే నేను ఇదే రోజున బెంగాల్ లో మరో మీటింగ్ కు హాజరు అవుతున్నాని చెప్పారు.అంతే కాదు తాజాగా వచ్చిన ఎన్నికల ఫలితాల మీద మమతా ఇప్పటికే విమర్శలు చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు సరైన వ్యూహం, ప్రణాళిక ఉండాలి. 2024లో ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరిగితే కేంద్రంలో బీజేపీ అధికాంలోకి రాదు అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. జమిందారీ మైండ్ పెట్ తో పోటీలోకి దిగితే ఫలితాలు ఇలానే ఉంటయని కూడా ఆమె అన్నారు. దాని తర్వాత కూటమి మీటింగ్ గురించి ఇలా స్పందించడం ఇప్పుడు హట్ టాపిక్ గా మారింది.

బీజేపీ, దాని మిత్రపక్షాలను ఎదుర్కొనేందుకు కాంగ్రస్, మరికొన్ని ప్రాంతీయ పార్టీలు ఇండియా కూటమిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మునపటి మీటింగ్‌కు శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాకరే సారథ్యం వహించారు. నాటి సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటూ పలువురు ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.


Tags

Read MoreRead Less
Next Story