Guinness Record : 24 వేల 679 వజ్రాలతో రింగ్ తయారీ.. భారత్‌కు మరో గిన్నిస్ రికార్డ్

Guinness Record :  24 వేల 679 వజ్రాలతో రింగ్ తయారీ.. భారత్‌కు మరో గిన్నిస్ రికార్డ్
Guinness Record : ఎస్‌డబ్ల్యుఏ డైమండ్స్ రూపొందించిన 24 వేల 679 వజ్రాలు పొదిగిన ఉంగరంతో భారతకు మరో గిన్నిస్ రికార్డు దక్కింది.

Guinness Record : ఉంగరంలో ఎన్ని రాళ్లు ఉంటాయి. మహా అయితే ఒకటి లేదా రెండు. కానీ ఒకతను అందరిలా ఆలోచిస్తే ఏముంటుంది రింగులో ఫింగరు అనుకున్నాడో ఏమో. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 24 వేల 679 వజ్రాలతో పొదిగిన ఉంగరాన్ని తయారుచేశారు.

కేరళలోని కోజికోడ్‌కు చెందిన ఎస్‌డబ్ల్యుఏ డైమండ్స్ రూపొందించిన 24 వేల 679 వజ్రాలు పొదిగిన ఉంగరంతో భారత ఖ్యాతికి మరో గిన్నిస్ రికార్డు సొంతమైంది. దీనిని ఎన్‌ఐడి విద్యార్థి రిజిషా టివి రూపొందించారు. ఈ డైమండ్ రింగ్ పింక్ ఓస్టెర్ మష్రూమ్ ప్రేరణగా నిలిచిందన్నారు. గతంలో 12 వేల 638 వజ్రాలు అమర్చిన రింగ్ రికార్డును ఈ కొత్త రింగు బద్దలు కొట్టింది.

90 రోజుల శ్రమతో ఈ అద్భుతమైన డైమండ్ రింగ్ తయారయిందని ఎస్‌డబ్ల్యూఏ నిర్వాహకులు తెలిపారు. రింగ్‌లోని అన్ని వజ్రాలు కేపీసీఎస్ సర్టిఫికేట్ పొందాయన్నారు. టచ్ ఆఫ్ అమీ ప్రపంచంలోని అనేక దేశాలలో ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకోవడంతో పాటు ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ రికార్డ్స్‌లో ప్థానం దక్కించుకుందని ఎస్‌డబ్ల్యూఏ నిర్వాహకులు చెప్పారు.

Tags

Next Story