New Delhi : ప్రారంభమైన కౌంటింగ్.. ద్రౌపదివైపే విజయం

New Delhi : ప్రారంభమైన కౌంటింగ్.. ద్రౌపదివైపే విజయం
X
New Delhi : రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

New Delhi : రాష్ట్రపతి ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పార్లమెంటులోని రూమ్ నెం.63లో కౌంటింగ్ చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్స్‌లను తెరుస్తున్నారు. సాయంత్రం 4 గంటలకల్లా రాష్ట్రపతి ఎన్నికల తుది ఫలితాలు వెలువడించనున్నారు. ద్రౌపది ముర్ముకు మెజార్టీ ఉండడంతో విజయం ఆమెవైపే ఉంది.

ఢిల్లీలోని తీన్‌మూర్తి మార్గ్‌లోని నివాసంలో ద్రౌపది ముర్ము ఉన్నారు. ద్రౌపది ముర్ము విజయాన్ని ఘనంగా చాటేలా బీజేపీ ఏర్పాట్లు చేసింది. బీజేపీ ఛీఫ్ నడ్డా సారధ్యంలో అభినందన్ యాత్రకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ద్రౌపది ముర్ము స్వగ్రామంలో సంబరాలు అంబరాన్ని అంటాయి.

Tags

Next Story