Indo-Pak Talks: చర్చలకు సిద్ధమే కానీ...

Indo-Pak Talks: చర్చలకు సిద్ధమే కానీ...
పాకిస్థాన్‌ ప్రధాని చర్చల ప్రతిపాదనపై స్పందించిన భారత్‌.

భారత్‌తో తీవ్రమైన సమస్యలపై చర్చలకు(Indo-Pak Talks) సిద్ధంగా ఉన్నామంటూ పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. దాయాది దేశం పాకిస్థాన్‌ సహా అన్ని దేశాలతో తాము సత్సంబంధాలు, స్నేహపూర్వక వాతావరణాన్నే కోరుకుంటామని భారత విదేశాంగ ప్రతినిధి అరిందం బాగ్చి(MEA Spokesperson Arindam Bagchi ) అన్నారు. కానీ అందుకు ఉగ్రవాద రహిత పరిస్థితులు(atmosphere free from terror), స‌హృద్భావ వాతావ‌ర‌ణం త‌ప్పనిస‌రిగా( violence for such a relationship) ఉండాలంటూ స్పష్టం చేశారు. నిజానికి పాకిస్తాన్‌తో భారత్ ఎప్పటినుంచో స్నేహపూర్వక సంబంధాల్ని కోరుకుంటూనే ఉందని విదేశాంగ శాఖ గుర్తు చేసింది. అలాంటి సంబంధం ఏర్పడాలంటే.. ఉగ్రవాదం, శతృత్వం లేని శాంతియుత వాతావరణాన్ని సృష్టించే బాధ్యత కూడా పాక్‌పై ఉందని వెల్లడించింది. భారత్ అన్ని దేశాలతో మంచి సంబంధాలు కోరుకుంటుందన్న విషయంలో ఎలాంటి సందేహమే లేదని అరిందం బాగ్చి తేల్చి చెప్పారు.


భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ప్రత్యక్ష చర్చలకు మద్దతు ఇస్తామని అమెరికా కూడా ఇప్పటికే ప్రకటించింది. ఆందోళన కలిగించే అంశాలపై భారత్‌-పాకిస్థాన్‌ల చర్చలకు తాము మద్దతు ఇస్తామని, ఇదే విషయాన్ని తాము చాలాకాలంగా చెబుతూనే ఉన్నామని(support direct dialogue between India and Pakistan ) అగ్రరాజ్యం వెల్లడించింది. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనాలనే తాము చాలా ఏళ్లుగా భావిస్తున్నామని వైట్‌హౌస్‌ అధికారిక ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. భారత్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నామని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రకటించిన తర్వాత అమెరికా దీనిపై స్పందించింది.


ఇటీవల భారత్‌-పాక్‌ సంబంధాలపై పాకిస్థాన్‌ ప్రధాని( Pakistan PM) షెహబాజ్‌ షరీఫ్‌( Shehbaz Sharif) కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని తీవ్రమైన సమస్యలపై( All Serious Matters) భారత్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు(Ready To Talk To India‌) ప్రకటించారు. పేదరికం, నిరుద్యోగం(poverty and unemployment)పై పోరాడుతున్న రెండు దేశాలకు యుద్ధం వాంఛనీయం కాదని( war is not an option) పేర్కొన్నారు. యుద్ధాల వల్ల పేదరికం, నిరుద్యోగం పెరిగిందని, విద్య, ఆరోగ్యం, ప్రజాసంక్షేమం వంటి ముఖ్యమైన రంగాలకు ఆర్థిక వనరుల కొరత ఏర్పడిందని పాక్‌ ప్రధాని అన్నారు.

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి పాక్‌-భారత్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. సరిహద్దుల్లో సీమాంతర ఉగ్రవాదానికి పాక్‌ ముగింపు పలికే వరకూ ద్వైపాక్షిక సంబంధాలు కష్టమేనని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ఇప్పటికే స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story