Kabul attack : అఫ్గన్‌పై వైమానిక దాడి ఓ పిరికిపంద చర్య.. పాకిస్థాన్‌‌పై భారత్ తీవ్ర ఆగ్రహం

Kabul attack : అఫ్గన్‌పై వైమానిక దాడి ఓ పిరికిపంద చర్య.. పాకిస్థాన్‌‌పై భారత్ తీవ్ర ఆగ్రహం
X
దాయాది చర్యలపై తీవ్రంగా స్పందించిన భారత్

అఫ్గనిస్థాన్‌లోని కాబూల్ ఆసుపత్రిపై పాకిస్థాన్‌ వైమానిక దాడిపై భారత్‌ స్పందించింది. దాడిని తీవ్రంగా ఖండించిన భారత్.. ఇదో పిరికిపంద, అమానుష చర్య అని మండిపడింది. పవిత్ర రంజాన్‌ మాసంలో ఇటువంటి దాడులకు పాల్పడటం అమానుషమని విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాబూల్‌లోని డ్రగ్స్‌కు బానిసైన వారికి చికిత్స అందించే ఆసుపత్రిపై సోమవారం రాత్రి పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడుల్లో 400 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 250 మంది గాయపడ్డారు.

‘‘పాకిస్థాన్‌ది అత్యంత పిరికిపంద, అమానుష చర్య. ఈ ఊచకోతను ఒక సైనిక ఆపరేషన్‌గా కప్పిపుచ్చుకోడానికి ఇస్లామాబాద్ ప్రయత్నిస్తోంది. సైనిక లక్ష్యంగా ఏమాత్రం సమర్థించలేని ఒక ప్రాంగణంలో భారీ సంఖ్యలో పౌరుల ప్రాణాలను బలిగొన్న ఈ చర్య, ఒక పిరికిపంద, నీచమైన హింసాకాండ అఫ్గనిస్థాన్‌ సార్వభౌమాధికారంపై జరిగిన ఈ హేయమైన, నిర్లక్ష్యపూరిత దాడి ప్రాంతీయ శాంతికి ప్రత్యక్ష ముప్పు. పాకిస్థాన్ తమ అంతర్గత వైఫల్యాలను ఇతరులపై నెట్టేందుకు సరిహద్దు వెలుపల ఇలాంటి తీవ్రమైన హింసాత్మక చర్యలకు దిగుతోంది. గతేడాది జనవరి నుంచి అఫ్గన్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఘర్షణలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సమాజాలలో శాంతి, కరుణ, దయకు ప్రతీకగా నిలిచే పవిత్ర రంజాన్ మాసంలో ఈ దాడి జరగడం హేయమైన చర్య.. ఒక ఆసుపత్రిని, అందులోని రోగులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోవడాన్ని ఏ మత విశ్వాసం, ఏ చట్టం, ఏ నైతికతా సమర్దించదు... ఈ చర్యలకు పాల్పడిన వారిని అంతర్జాతీయ సమాజం బాధ్యులను చేయాలి. ఉద్దేశపూర్వకంగా పాక్ చేస్తున్న దాడులను తక్షణమే అడ్డుకోవాలి’’ అని విదేశాంగ శాఖ తన ప్రకటనలో పేర్కొంది.

అంతేకాదు, అఫ్గన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు ఎల్లప్పుడూ భారత్ మద్దతు ఇస్తుందని స్పష్టం చేసింది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అఫ్గన్ ప్రజలకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చింది. పాకిస్థాన్ వైమానిక దాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు భారత్ ప్రగాఢ సానుభూతి తెలిపింది. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. మరోవైపు కాబూల్ ఆసుపత్రిపై దాడి చేశామనే ఆరోపణలను పాకిస్థాన్ తోసిపుచ్చింది. తూర్పు అఫ్గనిస్థాన్‌లోని తాము జరిపిన దాడులు ఏ పౌర ప్రదేశాలను తాకలేదని తెలిపింది.

తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి హమదుల్లాహ్ ఫిత్రాత్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ పెడుతూ.. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9 గంటల సమయంలో కాబూల్ ఆసుపత్రిపై వైమానిక దాడి జరిగింది. మొత్తం 2 వేల పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆసుపత్రిపై జరిగిన దాడిలో 400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

Tags

Next Story