Population Day: దేశంలో భారీగా తగ్గిన పేదరికం, రిపోర్ట్ విడుదల

Population Day: దేశంలో భారీగా తగ్గిన పేదరికం, రిపోర్ట్ విడుదల

భారతదేశంలో సుమారు 41.5 కోట్ల మంది ప్రజలు పేదరికం కోరల నుంచి బయటపడ్డారని యునైటెడ్ నేషన్స్ వెల్లడించింది. భారీ జనాభా ఉన్నప్పటికీ ఈ ఘనతను 2005-06 నుంచి 2019-20 మధ్య 15 సంవత్సరాల్లోనే ఈ ఘనత సాధించి, మానవాభివృద్ధి సూచిల్లో సాధించిన ప్రగతిని కొనియాడింది. భారత్‌లో పేదలు 2005-06లో 64.5 కోట్లు ఉండగా, 2015-16 సంవత్సరానికి 37 కోట్లు, 2019-21 సంవత్సరానికి 23 కోట్లకు తగ్గిందని వెల్లడించింది. అలాగే పేదరికంలో ఉంటూ సరిగా పోషకాహారం అందని వారి శాతం 44.3 నుంచి 11.8 శాతానికి తగ్గింది. శిశు మరణాల సంఖ్య శాతం 4.5 నుంచి 1.5 కి పడిపోయింది.


25 దేశాలు పేదరికాన్ని సగానికి తగ్గించాయని, పేదరిక నిర్మూలన సాధ్యమే అని గుర్తుచేసింది. పక్కనే ఉన్న చైనా(2010–14)కూడా 6.9 కోట్ల మందిని, ఇండోనేషియా(2012-17) 80 లక్షల మందిని, బంగ్లాదేశ్‌ 1.9 కోట్లు, పాకిస్థాన్ 70 లక్షల మందిని పేదరికం నుంచి బయటపడేయగలిగాని వెల్లడించింది.

రోజుకి 1.90 అమెరికా డాలర్ల కంటే తక్కువ సంపాదనతో ఆధారపడి జీవించే వారిని పేదలుగా నిర్ణయించడానికి కొలమానంగా తీసుకున్నారు.

110 దేశాల్లో పేదరికాన్ని కొలవడానికి కొన్ని అంశాలతో కూడిన గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్‌(MPI)ని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో విడుదల చేసింది. ఇందులో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(UNDP)తో పాటు ఆక్స్‌ఫర్డ్ పావర్టీ, హ్యూమన్ డెవెలప్మెంట్ ఇనిషియేటివ్ సంస్థలు భాగం పంచుకున్నాయి.

ఈ రిపోర్ట్ ప్రకారం 12 సంవత్సారాల కాలంలోనే ఇండియా, కాంబోడియా, చైనా, కాంగో, హోండూరస్, ఇండోనేషియా, మొరాకో, సెర్బియా, వియత్నాం వంటి దేశాలు గణనీయంగా వృద్ధి సాధించాయని వెల్లడించింది.


కోవిడ్ కాలానంతరం డేటా సరిపడా లేనందున, పేదరికంపై కోవిడ్‌ ప్రభావాన్ని అంచనా వేయడంలో కొద్దిగా పరిమితం చేసిందని వెల్లడించింది.

ప్రపంచవాప్తంగా 610 కోట్ల జనాభాలో 110 కోట్ల మంది బహుళ విధాల పేదరికంలో ఉన్నారు. సబ్ సహారన్ ఆఫ్రికా, సౌత్‌ ఏషియాలో ప్రతీ ఆరుగురిలో ఐదుగురు పేదరికంలో ఉంటున్నారు. మొత్తం పేదల్లో 2 వంతుల మంది మధ్య ఆదాయ దేశాల్లోనే నివసిస్తున్నారు. ఈ దేశాల్లో అభివృద్ధి, ప్రణాళికలతో ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని తగ్గించవచ్చని వెల్లడించింది.

పేదరికంలో ఉన్న వారిలో 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారు 56.6 కోట్ల మంది ఉన్నారు. ప్రతీ 100 మందికి పెద్దల్లో 13.4 శాతం, పిల్లల్లో 27.7 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story