Indian Army Drills: ఆర్మీ లో కొత్త అస్త్రాలు

Indian Army Drills: ఆర్మీ లో కొత్త అస్త్రాలు
ఈస్ట్ర‌న్ ల‌డాఖ్‌లో సైనిక విన్యాసాలు..

ఇండియన్ ఆర్మీ త‌న ఆయుధ స‌త్తాను చాటుతోంది. కొత్త ఆయుధాల‌తో ల‌డాఖ్‌లో డ్రిల్స్ చేస్తోంది. ఆర్మీ ట్యాంక్‌లు, యుద్ధ వాహ‌నాలు ఇండ‌స్ న‌ది దగ్గర సైనిక విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. అంతర్జాతీయ సరిహద్దు వద్ద ప్రత్యర్థుల కదలికలపై నిఘా ఉంచడానికి ఆర్మీ ఈ కొత్త పరికరాలు, ఆయుధాలను రంగంలోకి దించింది. శ‌త్రు స్థావ‌రాల‌ను టార్గెట్ ఎలా చేయాల‌న్న కోణంలో అక్క‌డ విన్యాసాలు కొన‌సాగుతున్నాయి.

ఇండియ‌న్ ఆర్మీ. ధ‌నుష్ హోవిట్జ‌ర్‌ను ఆర్మీ ప‌రీక్షించింది. ఇండ‌స్ వ‌ద్ద యుద్ధ ట్యాంకులు న‌దిని దాటాయి. ఈస్ట్ర‌న్ ల‌డాఖ్‌లో ఇండియన్ ఆర్మీ త‌న ఆయుధ స‌త్తాను చాటుతోంది. శత్రువుల‌ను ఎలా టార్గెట్ చేయాల‌న్న కోణంలో భార‌తీయ సైన్యం అక్క‌డ శిక్ష‌ణ పొందుతోంది. అధునాత‌న యుద్ధ ట్యాంకర్ల‌తో పాటు ఇత‌ర ఆయుధాల‌ను సైన్యం ప‌రీక్షిస్తోంది.



ఇండ‌స్ న‌ది మీదుగా ట్యాంక‌ర్ల‌ను తీసుకువెళ్లారు. 14,500 అడుగుల ఎత్తులో ఉన్న మిలటరీ స్టేషన్ వద్ద కొత్త ఆయుధ వ్యవస్థ, పరికరాలను ఏర్పాటు చేసింది. ఆ డ్రిల్స్‌కు చెందిన కొన్ని వీడియోలు రిలీజ్ అయ్యాయి. కొత్త వెప‌న్ సిస్ట‌మ్‌లో ధ‌నుష్‌, మేడ్ ఇన్ ఇండియా హోవిట్జ‌ర్‌, ఎం4 క్విక్ రియాక్ష‌న్ ఫోర్స్ వెహికిల్స్ కూడా ఉన్నాయి. అన్ని భూభాగాల్లోనూ దూసుకువెళ్లే ట్యాంర్ల‌ను ల‌డాక్‌లో ప‌రీక్షిస్తున్నారు.

జ‌బ‌ల్‌పూర్‌లో ఉన్న గ‌న్ ఫ్యాక్ట‌రీలో ధ‌నుష్ హోవిట్జ‌ర్‌ను త‌యారు చేశారు. ఈ ఆయుధాన్ని గ‌త ఏడాది ఇక్క‌డ స్టేష‌న్ చేశారు. కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించగలదు. 4000 మీట‌ర్ల ఎత్తులో ఉన్న టార్గెట్‌ను ఈ హోవిట్జ‌ర్ ధ్వంసం చేయ‌గ‌ల‌దు. ఇందులో ఆరు ర‌కాల అమ్యూనేష‌న్ ఉంటుంది. ఇంకా ఒకేసారి మూడు రౌండ్లు ఫైర్ చేయ‌గ‌ల‌దు. బోఫోర్స్ టెక్నాల‌జీనే దీనికి ట్రాన్స్‌ఫ‌ర్ చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు అభివృద్ధి చేసి ఉత్పత్తి చేసిన 114 తుపాకులు కూడా భారత సైన్యంలో చేరనున్నాయి. అలాగే సేనలను చాలా త్వరగా ఫార్వర్డ్ లొకేషన్లకు తరలించడానికి ఉపయోగపడే మరో మేడ్ ఇన్ ఇండియా ప్లాట్‌ఫారమ్ M4 క్విక్ రియాక్షన్ ఫోర్స్ వెహికల్. ఇది పోరాటానికి సిద్ధంగా ఉన్న 10 సాయుధ దళాలను ఒకేసారి వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ముందుకు తరలించగలదు. లడఖ్ సెక్టార్‌లోని కఠినమైన భూభాగంలో కూడా గంటకు 60-80 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది.

Tags

Read MoreRead Less
Next Story