Indian Coast Guard: నడి సముద్రంలో రెస్క్యూ ఆపరేషన్
అలా అలా అరేబియా సముద్రంలోని ఓ ఓడలో సుఖంగా ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి నడి సముద్రంలో హర్ట్ స్ట్రోక్ వచ్చింది. పరిస్థితి అదుపు దాటుతోంది. దీంతో తోటివారు కోస్డ్ గార్డ్స్ కి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వారు రెస్క్యూ ఆపరేషన్ చేసి, అతన్ని హెలికాప్టర్‌లోకి తీసుకుని ప్రథమ చికిత్సను అందించి, ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సను చేసి ప్రాణాలు కాపాడారు.
పనామా ఫ్లాగ్ ఉన్న ఒక ఎంవీ డాంగ్ ఫాంగ్ కాన్ టాన్ నంబర్ 2 రీసర్చ్ నౌక చైనా నుంచి అరేబియా సముద్రం మీదుగా యూఈఏ వెళుతుంది. బుధవారం రాత్రి ఈ నౌకలో పనిచేస్తున్న సిబ్బంది యిన్ వీగ్‌యాంగ్ కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యాడు. తీవ్రమైన ఛాతినొప్పితో చాలా ఇబ్బంది పడిపోయాడు. సమస్య తీవ్రతను గుర్తించిన నౌక సిబ్బంది తాము ముంబయికి సమీపంలో ఉన్నామని గురించి, సమీప తీర ప్రాంతమైన ముంబయిలోని మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్‌కు అత్యవసర సందేశం పంపించారు.దాంతో అప్రమత్తమైన భారత కోస్ట్‌గార్డ్ సిబ్బంది బాధితుడిని ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని నిర్ణయించారు.
అయితే సముద్రం మధ్యలో నుండి అతనిని ఆసుపత్రికి తీసుకోవడం అంత సులువైన విషయమేమీ కాదు. దీంతో అతనిని ఆసుపత్రికి చేర్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ఏఎల్‌హెచ్ ఎంకే-3 హెలికాప్టర్‌తో కోస్ట్‌గార్డ్ బయల్దేరారు.
అర్థరాత్రి సమయం.. ఆ చైనా నౌక అరేబియా సముద్రంలో తీరానికి దాదాపు 200 కి.మీల దూరంలో ఉంది. వాతావరణ పరిస్థితులు కూడా ప్రతికూలంగానే ఉన్నాయి. అయినప్పటికీ కోస్ట్‌గార్డ్ చిమ్మచీకట్లో ధైర్యంగా నౌకలో నుంచి వీగ్‌యాంగ్‌ను ఎయిర్‌లిఫ్ట్ చేసి హెలికాప్టర్‌లోకి తీసుకుంది. వెంటనే ప్రథమ చికిత్స అందించారు. ప్రథమ చికిత్స అనంతరం సమీప ఆసుపత్రికి తరలించినట్లు భారత రక్షణ శాఖ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. కొద్ది రోజుల క్రితం కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురైన సందర్భంలో కూడా కోస్ట్ గార్డ్ రెస్క్యూ ఆపరేషన్ చేసి సిబ్బంది ప్రాణాలు కాపాడారు. ఇప్పుడు మరోసారి అటువంటి ఆపరేషన్ చేసి చైనా వ్యక్తి ప్రాణాలు కాపాడారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com