Canada : కెనడాలో ఉంటున్న భారతీయులకు హెచ్చరిక..

Canada : కెనడాలో ఉంటున్న భారతీయులకు హెచ్చరిక..
Canada : కెనడాలో ఉంటున్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది

Canada : కెనడాలో ఉంటున్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కెనడాలో విద్వేషపూరిత ఘటనలు, మతపరమైన హింస, భారత వ్యతిరేక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని భారత విదేశాంగశాఖ హెచ్చరించింది.

కెనడాలో జరుగుతున్న విద్వేష నేరాలు, భారత వ్యతిరేక కార్యక్రమాల గురించి ఆ దేశంతో చర్చించినట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించింది. దాడి ఘటనలపై దర్యాప్తు చేపట్టి, చర్యలు తీసుకోవాలని కెనడా అధికారుల్ని రిక్వెస్ట్‌ చేసింది భారత విదేశాంగ శాఖ. కానీ కెనడా ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో.. కెనడాలోని భారతీయ పౌరులు, విద్యార్థులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ఇటీవల కెనడాలో ఖలిస్థానీ అనుకూల అతివాద సంస్థ 'సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ ఆధ్వర్యంలో ఖలిస్థాన్‌ రెఫరెండం నిర్వహించారు. దీనిపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజకీయ ప్రేరేపిత దేశవ్యతిరేక శక్తులు ఎదుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతోపాటు అక్కడి ఓ ఆలయంపైనా దాడి జరిగింది. ఈ విధమైన వరుస ఘటనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story