Pak Woman : పాక్‌ యువతికి భారతీయుని గుండె!

Pak Woman : పాక్‌ యువతికి భారతీయుని గుండె!
సరిహద్దులు దాటిన మానవత్వం…

హార్ట్‌ ఫెయిల్యూర్‌తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్‌కు చెందిన ఒక యువతికి భారత్‌కు చెందిన ఒక డోనర్‌ అందించిన గుండె కొత్త జీవితాన్ని ప్రసాదించింది. పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన 19 ఏండ్ల ఆయేషా రాషన్‌కు చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్‌ వైద్యులు గుండెను మార్చి పునర్జన్మనిచ్చారు. ఆపరేషన్‌కు రూ.35 లక్షలు అయ్యిందని, అయితే ఆ మొత్తాన్ని ఎంజీఎం హాస్పిటల్‌, మెడికల్‌ ట్రస్ట్‌ వారే భరించారని, వైద్యమంతా ఉచితంగా అందించారని ఆయేషా తల్లి వారికి కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం ఆయేషా ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆమె పాకిస్థాన్‌ వెళ్లిపోవచ్చునని డాక్టర్లు తెలిపారు.

ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న ఓ పాకిస్తాన్‌ యువతికి భారత వైద్యులు పునర్జన్మనిచ్చారు. ఉచితంగా గుండె మార్పిడి ఆపరేషన్‌ చేసి ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఈ ఆపరేషన్‌ ఐశ్వర్యన్‌ ట్రస్టువారి సహకారంతో చెన్నై ఎంజీఎం హస్పిటల్‌ లో జరిగింది. పాక్‌ కు చెందిన అయేషా రషన్‌అనే యువతి గత కొంత కాలంగా గుండె సంబంధింత సమస్యతో బాధపడుతుంది. కొద్ది రోజుల నుంచి ఆమె పరిస్థితి మరింత దిగజారింది.

వైద్యులు ఆమెను ఎక్మోపై ఉంచి చికిత్స ఇవ్వడం ప్రారంభించారు. అయితే, హార్ట్‌ పంప్‌లోని వాల్వ్‌లో లీక్ ఏర్పడటంతో గుండె మార్పిడి ఆపరేషన్ తప్పనిసరైంది. అయితే.. ఆ ఆపరేషన్‌ కు సుమారు రూ. 35 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు మొత్తాన్ని కూడా ఐశ్వర్యన్ ట్రస్టు, వైద్యులే సమకూర్చారు. ఢిల్లీ నుంచి వచ్చిన గుండెను యువతికి అమర్చి విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగ్గా ఉందని అయేషా తెలిపింది. తన బిడ్డ ప్రాణాలను కాపాడిన ట్రస్టు, వైద్యులకు అయేషా తల్లి ధన్యవాదాలు తెలిపారు. సాధారణంగా అవయవదానానికి సంబంధించి విదేశీయులకు రెండో ప్రాధాన్యం ఉన్నా అయేషాకు మాత్రం సులభంగా గుండె లభించిందని ఇన్‌స్టిట్యూస్ ఆఫ్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ డైరెక్టర్ డా. బాలకృష్ణన్, కో డైరెక్టర్ డా. సురేశ్ రావు వివరించారు. అయేషా విషయంలో గుండె కోసం మరెవరూ క్లెయిమ్ చేసుకోలేదని తెలిపారు. అవయవదానం, ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్స్‌లో చెన్నై ముందున్న విషయం ఈ ఆపరేషన్‌తో మరోసారి స్పష్టమైందని వైద్యులు వ్యాఖ్యానించారు.

Tags

Read MoreRead Less
Next Story