Indian Immigrants: బోర్డర్ దాటే ప్రయత్నంలో అమెరికా పోలీసులకు దొరికేది ఎక్కువగా భారతీయులేనట

అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే వలసదారుల్లో భారతీయుల సంఖ్యే ఎక్కువని తాజా నివేదికల్లో బయటపడింది. అక్రమంగా సరిహద్దులు దాటి పెద్ద సంఖ్యలో భారతీయులు పట్టుబడుతున్నారని తేలింది. యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ పోలీస్ నివేదిక ప్రకారం.. గతేడాది సగటున ప్రతీ 20 నిమిషాలకు ఓ భారతీయుడిని అరెస్టు చేసినట్లు సమాచారం. మొత్తంగా 2025 లో 23,830 మంది భారతీయులు సరిహద్దుల వద్ద పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు. 2024 ఏడాదిలో ఇదేవిధంగా 85,119 మందిని అరెస్టు చేసినట్లు వివరించారు.
కాగా, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించాక ఇమ్మిగ్రేషన్ చట్టాలను కఠినంగా మార్చిన విషయం తెలిసిందే. అక్రమ వలసలపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని బోర్డర్ పోలీసులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీంతో చాలావరకు అక్రమ వలసలను అధికారులు కట్టడి చేశారు. శిక్షలకు భయపడి బోర్డర్ దాటేందుకు చాలామంది సాహసించడంలేదు. అయినప్పటికీ భారతీయులు మాత్రం ఎలాగైనా అమెరికాలో అడుగుపెట్టాలని బోర్డర్ క్రాస్ చేసేందుకు తెగిస్తున్నారని ఆరోపించారు.
బోర్డర్ దాటుతూ పట్టుబడ్డ భారతీయుల్లో యువతే ఎక్కువని, ఉద్యోగం కోసం, మంచి వేతనం కోసం వారు ఈ సాహసానికి పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. మరోవైపు, సరిహద్దుల్లో తల్లీతండ్రులు లేకుండా పిల్లలు మాత్రమే పట్టుబడుతున్న సంఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
