INS Kirpan: వియత్నాంకు కానుకగా భారత యుద్ధనౌక
సరిహద్దుల్లో దూకుడుగా వ్యవహరిస్తూ విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న చైనా(China)కు చెక్ పెట్టేలా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. స్నేహపూర్వంగా ఉండే దేశాలకు సహాయం చేస్తూ పట్టు పెంచుకుంటోంది. ఈ క్రమంలోనే వియత్నాంకు భారత్ అరుదైన కానుక అందించింది. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి నిదర్శనంగా చైనా పొరుగు దేశమైన వియత్నాంకు (Vietnam) యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ కృపాణ్ (INS Kirpan) యుద్ధనౌకను బహుమతిగా ఇచ్చింది.
ఇరు దేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి గుర్తుగా 32 ఏళ్లుగా ఇండియన్ నేవీకి సేవలందిస్తున్న ఈ యుద్ధ నౌకను వియత్నాం(Vietnam)కు కానుకగా ఇచ్చింది. ఆ దేశ పర్యటనలో ఉన్న భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరి కుమార్ (Navy Chief Admiral R Hari Kumar) బే ఆఫ్ కామ్ రన్హ్ జలాల్లో జరిగిన కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ కృపాణ్‌ను వియత్నాం పీపుల్స్ నేవీకి (Vietnam People’s Navy) అప్పగించారు.
ఇలా సేవలందించే ఓ యుద్ధనౌకను భారత్ తన మిత్రదేశానికి బహుమతిగా ఇవ్వడం ఇది మొదటిసారి. ఈ బహుమతితో దక్షిణ చైనా సముద్రమంతా (South China Sea) తమదేనంటూ రెచ్చిపోతున్న డ్రాగన్‌కు చెక్ పడనుంది.
పూర్తిస్థాయి ఆయుధాలతో కూడిన నౌక(The ship is equipped with an array of weapons) ను ఆ దేశ నేవీకి అప్పగించినట్టు భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరి కుమార్ (Navy Chief Admiral R Hari Kumar) వివరించారు. భారత్ జీ20 సదస్సు ప్రధాన థీమ్ అయిన వసుధైక కుటుంబం నినాదంలో భాగంగానే ఈ కానుక ఇచ్చినట్టు తెలిపారు. ఐఎన్‌ఎస్ కృపాణ్ (INS Kirpan) గస్తీతో దక్షిణ చైనా జలాల్లో అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా అన్ని దేశాలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐఎన్‌ఎస్ కృపాణ్ జూన్ 28న విశాఖపట్నం నుంచి బయల్దేరి జూలై 8 నాటికి వియత్నాం చేరింది.
దేశీయంగా నిర్మించిన ఐఎన్ ఎస్ కృపాణ్ యుద్ధనౌకను వియత్నాంకు అప్పగించడం.....స్నేహపూర్వక దేశాలకు సాయం చేయడంసహా వారి రక్షణ సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు భారత్ కట్టుబడి ఉంటుందనే విషయాన్ని చాటుతుందని నౌకాదళం(Indian Navy) తెలిపింది. భారత నౌకాదళంలో 32ఏళ్లపాటు సేవలందించిన ఈ యుద్ధనౌకను....వియత్నాంకు బహుమతిగా ఇవ్వనున్నట్లు గతనెలలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com