Canada: కెనడాలో భారత సంతతి వ్యాపారవేత్త హత్య

Canada: కెనడాలో భారత సంతతి వ్యాపారవేత్త హత్య
X
కాపాడమని వేడుకున్నా పట్టించుకోలేదన్న కూతురు

కెనడాలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త హర్‌జీత్‌ దడ్డా బుధవారం దారుణ హత్యకు గురయ్యారు. ఒంటారియో, మిసిసాగా పార్కింగ్‌ లాట్‌ లో ఆయనపై కొందరు కాల్పులు జరిపి, పారిపోయారు. ఆయననుఆసుపత్రికి తరలించినప్పటికీ, ఫలితం దక్కలేదు. ఆయన కుమార్తె గుర్లీన్‌ విడుదల చేసిన ప్రకటనలో, తన తండ్రికి అనేకసార్లు బెదిరింపులు వచ్చాయని, కాపాడాలని పోలీసులను వేడుకున్నప్పటికీ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమను కాపాడాల్సిన వ్యవస్థ విఫలమైందన్నారు. ఇదిలావుండగా, హర్జీత్‌ హత్యకు తమదే బాధ్యత అని లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ప్రకటించినట్లు మీడియా కథనాలను బట్టి తెలుస్తున్నది.

Tags

Next Story