Indian Railways: రైల్వే రిటర్న్ టికెట్లపై 20 శాతం రాయితీ

పండుగ సీజన్‌లో రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది భారతీయ రైల్వేశాఖ.. పండుగ సమయంలో తిరుగు ప్రయాణ టిక్కెట్లపై 20 శాతం తగ్గింపును ప్రకటించింది.. అక్టోబర్ 13 నుండి అక్టోబర్ 26 వరకు ఉన్న అడ్వాన్స్‌డ్ రిజర్వేషన్లలో తిరుగు ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకుంటే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.. అక్టోబర్ 13-26 మధ్య.. నవంబర్ 17 నుండి డిసెంబర్ 1 వరకు అదే రైలు నుండి తిరిగి వచ్చే ప్రయాణాలకు బుక్ చేసుకున్న టిక్కెట్లపై 20 శాతం తగ్గింపును అందించే పథకాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ ఈ రోజు ప్రకటించింది.
ఆగస్టు 14 నుండి బుక్ చేసుకున్న టిక్కెట్లపై ఈ డిస్కౌంట్ ఉంటుంది.. కానీ, రాజధాని, శతాబ్ది, దురంతో మొదలైన ఫ్లెక్సీ ఫేర్ రైళ్లలో రిబేట్ వర్తించదు. ARP (ముందస్తు రిజర్వేషన్ వ్యవధి) తేదీ 13 అక్టోబర్ 2025 కోసం బుకింగ్ ప్రారంభ తేదీ 14.08.2025 అవుతుంది’ అని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. 13 అక్టోబర్ 2025 మరియు 26 అక్టోబర్ 2025 మధ్య రైలు ప్రారంభ తేదీకి ముందుగా టికెట్ బుక్ చేసుకోవాలి.. ఆ తర్వాత నవంబర్ 17 మరియు డిసెంబర్ 1, 2025 మధ్య రైలు ప్రారంభ తేదీకి కనెక్టింగ్ జర్నీ ఫీచర్ ఉపయోగించి తిరుగు ప్రయాణ టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.. కానీ, అక్టోబర్ 13 నుండి అక్టోబర్ 26 వరకు ఉన్న ముందస్తు రిజర్వేషన్ వ్యవధి (ARP), తిరుగు ప్రయాణాన్ని బుక్ చేసుకోవడానికి వర్తించదని స్పష్టం చేసింది.
ఈ పథకం కింద, ఒకే సెట్ ప్రయాణికులకు తదుపరి మరియు తిరుగు ప్రయాణాలకు బుక్ చేసుకున్నప్పుడు రాయితీలు వర్తిస్తాయి. తిరుగు ప్రయాణానికి సంబంధించిన ప్రయాణీకుల వివరాలు తదుపరి ప్రయాణానికి సంబంధించినవిగానే ఉంటాయి’ అని పేర్కొంది రైల్వేశాఖ.. పైన పేర్కొన్న బుకింగ్ రెండు దిశలలో ధృవీకరించబడిన టిక్కెట్లకు మాత్రమే అనుమతించబడుతుంది. తిరుగు ప్రయాణానికి సంబంధించిన బేస్ ఛార్జీపై మాత్రమే మొత్తం 20 శాతం రాయితీలు మంజూరు చేయబడతాయి అని రైల్వే మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది.. ఈ స్కీమ్ కింద బుకింగ్ ఒకే క్లాస్‌తో పాటు ఒకే గమ్యస్థానం ఉండాలని పేర్కొంది రైల్వేశాఖ..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com