Indian student: అమెరికాలో ప్రమాదం.. కోమాలో భారతీయ విద్యార్థిని

Indian student: అమెరికాలో ప్రమాదం.. కోమాలో భారతీయ విద్యార్థిని
X
వీసా కోసం భారతీయ విద్యార్థిని కుటుంబం ఆవేదన

అమెరికాలో ప్రమాదానికి గురై, కోమాలోకి వెళ్లిపోయిన తమ బిడ్డను చూసేందుకు వీసా ఇవ్వాలంటూ ఓ కుటుంబం వేడుకుంటోంది. వీసా కోసం తాము చేస్తోన్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కోరింది

అమెరికాలో జరిగిన రోడ్డుప్రమాదంలో భారతీయ విద్యార్థిని నీలం షిండే పరిస్థితి విషమంగా ఉంది. ఈనెల 14న ఆమె ప్రయాణించిన కారు ప్రమాదానికి గురైంది. అప్పటి నుంచి ఆమె ఐసీయూలో ఉంది. ప్రస్తుతం కోమాలోకి వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నీలం షిండేది మహారాష్ట్రలోని సతారా జిల్లా. ఈ పరిణామంపై లోక్‌సభ ఎంపీ సుప్రియా సూలే స్పందించారు. కుమార్తెను చూసేందుకు తల్లిదండ్రులకు అత్యవసర వీసా మంజూరు అయ్యేలా చూడాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉంటే ప్రమాదం చేసిన కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 16న ప్రమాదం జరిగినట్లుగా తమకు తెలిసిందని తండ్రి తనాజీ షిండే పేర్కొన్నారు. అప్పటి నుంచి వీసా కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కానీ ఇప్పటి వరకు తమకు వీసా రాలేదని వాపోయాడు. దీంతో ఎన్‌సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సులే స్పందించి.. వీసా ఇప్పించడానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సహాయం కోరినట్లు తెలిపారు. ఈ సమస్యను త్వరగా కేంద్రం పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఆ కుటుంబానికి తాము అండగా ఉంటామని ఎంపీ హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే కారు ప్రమాదంలో బాధితురాలి కాళ్లు, చేతులు విరిగిపోయినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా తలకు గాయాలు కావడంతో కోమాలోకి వెళ్లినట్లు సమాచారం. నీలం షిండే గత నాలుగేళ్లుగా అమెరికాలో ఉంటుంది. ఈ ఏడాదితో చదువు పూర్తవుతుంది. ఇంతలోనే ఈ ప్రమాదం జరిగింది.

Tags

Next Story