CMS-03: అత్యంత ‘‘బరువైన’’ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో..

CMS-03: అత్యంత ‘‘బరువైన’’ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో..
X
భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసకెళ్లనున్న ఎల్‌వీఎం 3 రాకెట్‌..!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) దేశంలోనే అత్యంత బరువైన కమ్యూనికేషన్ శాటిలైట్ CMS-03ను ప్రయోగానికి సిద్ధమైంది. నవంబర్ 2 ఆదివారం రోజున శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి శాటిలైట్ ప్రయోగం జరుగనుంది. ఇది మల్టీ బ్యాండ్ మిలిటరీ కమ్యూనికేషన్ శాటిలైట్. దీనిని GSAT-7R అని కూడా పిలుస్తారు. ఈ ఉపగ్రహాన్ని ఇస్రో అత్యంత శక్తివంతమైన రాకెట్ అయిన లాంచ్ వెహికల్ మార్క్ 3 (LVM3) ద్వారా ప్రయోగించనున్నారు.

ఈ శాటిలైట్ ద్వారా భారత భూభాగంతో సహా విస్తృత సముద్ర ప్రాంతంలో సేవలు అందిస్తుందని ఇస్రో తెలిపింది. సుమారు 4400 కిలోల బరువున్న CMS-03 శాటిలైట్‌ను జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (GTO)లో చేర్చనున్నారు. LVM3 రాకెట్ భారతదేశంలోనే అత్యంత బరువైన రాకెట్. ఇది 4000 కిలోల వరకు బరువును మోసుకెళ్లగలదు.

చంద్రయాన్-3 వంటి మిషన్‌లను ఈ రాకెట్ ద్వారా చంద్రుడి పైకి విజయవంతంగా ప్రయోగించబడింది. CMS-03 పేలోడ్‌లో డేటా, వీడియో లింక్‌ల కోసం C, ఎక్స్‌టెండెల్ C, Ku బ్యాండ్‌లు ఉన్నారు. ఈ శాటిలైట్ నేవీకి కనెక్టివిటీని గణనీయంగా పెంచుతుంది. ఇది అధిక సామర్థ్యం కలిగిన బ్యాండ్ విడ్త్ ను కూడా అందిస్తుంది. తర్వాత మారుమూల ప్రాంతాలకు డిజిటల్ యాక్సెస్ మెరుగవుతుంది. గతవారం, ఇస్రో ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ మాట్లాడుతూ.. ఈ ఏడాది చివరి నాటికి 6.5 టన్నుల బ్లూబర్డ్-6 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తానని ప్రకటించారు. చంద్రయాన్‌-3 మిషన్‌ను విజయవంతంగా మూసుకెళ్లిన ఎల్‌వీఎం 2 రాకెట్‌కు ఇదో ఐదో మిషన్‌ కానున్నది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది చివరలో ఇస్రో మరో భారీ శాటిలైట్‌ ప్రయోగం చేపట్టనున్నది. యూఎస్‌కు చెందిన ఏఎస్‌టీ స్పేస్ మొబైల్‌ తయారు చేసిన 6.5 టన్నుల బరువున్న బ్లూబర్డ్‌-6 శాటిలైట్‌ను సైతం ఇదే ఎల్‌వీఎం 3 రాకెట్‌ నింగిలోకి మూసుకెళ్లనున్నది. ఇందుకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని ఇస్రో చైర్మన్‌ నారాయణన్‌ తెలిపారు.

Tags

Next Story