ADR REPORT: మూడు రాష్ట్రాల బడ్జెట్‌ కంటే ఎమ్మెల్యేల ఆస్తే ఎక్కువ

ADR REPORT: మూడు రాష్ట్రాల బడ్జెట్‌ కంటే ఎమ్మెల్యేల ఆస్తే ఎక్కువ
దేశంలోని 4 వేల మంది ఎమ్మెల్యేల మొత్తం ఆస్తి రూ.54,545 కోట్లు... సగటు ఆస్తి విలువలో టాప్‌లో ఏపీ

దేశంలోని 4,001 మంది ఎమ్మెల్యేల‍ (4,001 sitting MLAs‌) మొత్తం ఆస్తుల విలువ రూ.54,545 కోట్ల రూపాయల(Rs 54,545 crore )ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR), నేషనల్ ఎలక్షన్ వాచ్ (NEW) సంయుక్తంగా వెల్లడించాయి. గత ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అఫిడవిట్ల నుంచి( affidavits filed by the MLAs) ఈ సమాచారాన్న సేకరించి, వాటిని విశ్లేషించిన తర్వాత ఈ నివేదికను విడుదల చేశాయి. దేశంలోని 28 రాష్ట్రాలు, అసెంబ్లీలు ఉన్న రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 4001 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల సమాచారాన్ని నివేదిక వెల్లడించింది. వీరందరి ఆస్తుల విలువ రూ.54,545 కోట్లని వివరించింది. నాగాలాండ్, మిజోరం, సిక్కిం రాష్ట్రాల ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్ మొత్తం కలిపినా రూ.49,103 కోట్లేనని నివేదిక గుర్తు చేసింది. నాగాలాండ్ 2023-24 వార్షిక బడ్జెట్ రూ.23,086 కోట్లుకాగా, మిజోరం రూ.14,210 కోట్లు, సిక్కిం రూ.11,807 కోట్లేనని నివేదిక పేర్కొంది.


దేశంలోని మొత్తం 4,033 మంది ఎమ్మెల్యేలకు గాను, 4,001 మంది అఫిడవిట్‌లను విశ్లేషించినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR), నేషనల్ ఎలక్షన్ వాచ్ (NEW) సంయుక్తంగా వివరించాయి. ఒక్కో ఎమ్మెల్యే(MLA) సగటు ఆస్తి విలువ రూ.13.63 కోట్లుగా పేర్కొంది. 1,356 మంది బీజేపీ(BJP) ఎమ్మెల్యేలలో ఒక్కో ఎమ్మెల్యే సగటు ఆస్తి విలువ రూ.11.97 కోట్లుకాగా... 719 మంది కాంగ్రెస్(CONGRESS) ఎమ్మెల్యేల్లో ఒక్కో ఎమ్మెల్యే ఆస్తి విలువ రూ.21.97 కోట్లని నివేదిక వెల్లడించింది. 227 మంది టీఎంసీల ఎమ్మెల్యేల ఆస్తుల విలువ రూ.3.51 కోట్లు, 146 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల సగటు ఆస్తి విలువ రూ.23.14 కోట్లని పేర్కొంది.


పార్టీల వారీగా ఎమ్మెల్యేల మొత్తం ఆస్తుల విలువ బీజేపీది రూ. 16,234 కోట్లుకాగా.. కాంగ్రెస్‌ది రూ. 15,798 కోట్లని నివేదిక వెల్లడించింది. ఎమ్మెల్యేల ఆస్తుల్లో సగానికి పైగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలవేనని నివేదిక విశ్లేషించింది. ఈ రెండు పార్టీల ఎమ్మెల్యేలకు రూ.32,032 కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిపింది. మొత్తం ఎమ్మెల్యేల ఆస్తుల్లో 58.73 శాతం ఈ రెండు పార్టీలకు శాసనసభ్యులవేనని వెల్లడించింది.

ఈశాన్య రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల ఆస్తులు తక్కువగా ఉండగా.. అత్యధిక ఆస్తులు ఉన్న ఎమ్మెల్యేల రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. కర్ణాటక ఎమ్మెల్యేల ఆస్తుల విలువ మిజోరం, సిక్కం రాష్ట్రాల వ్యక్తిగత వార్షిక బడ్జెట్ల కన్నా అధికం. ఎమ్మెల్యేల మొత్తం ఆస్తుల్లో కర్ణాటక శాసనసభ్యుల వాటా 26 శాతం. ఎమ్మెల్యేల ఆస్తుల్లో కర్ణాటక , మహారాష్ట్ర , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.

Tags

Read MoreRead Less
Next Story