Indian Army: సైన్యంలో స్వదేశీ మోడ్యులర్ బ్రిడ్జి

Indian Army: సైన్యంలో  స్వదేశీ మోడ్యులర్ బ్రిడ్జి
డిఫెన్స్ రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ రూపకల్పన

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ -DRDO మరో అద్భుతాన్ని సాధించింది. సైన్యం కోసం అత్యాధునిక మాడ్యుల్‌ బ్రిడ్జ్‌ను రూపొందించింది. మంగళవారం దిల్లీలో జరిగిన వేడుకల్లో దీన్ని సైన్యానికి అప్పగించింది. దీని ద్వారా తక్కువ కాలంలో వేగంగా వంతెన నిర్మించి నదులు, కాలువలను సైన్యం దాటవచ్చు. ప్రకృతి విపత్కర పరిస్థితుల్లో, పోరాట సమయాలలో సైన్యం రవాణకు ఇది భవిష్యత్తులో ప్రముఖ భూమిక పోషించనుంది.

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ-DRDO మరో అద్భుతాన్ని సుసాధ్యం చేసింది. సైన్యం అవసరాల కోసం అత్యంత వేగంగా, తాత్కాలికంగా 46మీటర్ల పొడవున నిర్మించగల మాడ్యుల్ బ్రిడ్జ్‌ను రూపొందించింది. నదులు, నీటి కాలువులపై నుంచి వంతెనలు లేకున్నఈ బ్రిజ్జ్‌ను ఉపయోగించి వాటిని సులభంగా, వేగంగా దాటవచ్చు. భారీ యుద్ధట్యాంకర్లు సైతం ఈ బ్రిడ్జ్‌పై ప్రయాణించే విధంగా రూపొందించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా దేశీయంగా తయారుచేసిన ఈ మాడ్యులు బ్రిడ్జ్‌ను....దిల్లీలో జరిగిన వేడుకలో సైన్యం చేతికి DRDO అప్పగించింది. ఈ మాడ్యుల్‌ వంతెన్ను DRDO సహాయంతో లార్సన్‌ అండ్‌ టూబ్రో కంపెనీ రూపొందించింది. ఈ సందర్భంగా వచ్చే నాలుగేళ్లలో 41 మాడ్యుల్‌ వంతెనలను సైన్యం చేతికి అందిచనున్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. కాలువలు, గుంతలు, తదతర ఆటంకాలను సైన్యం అధిగమించడానికి వేగంగా వాటిని దాటడానికి ఈ మోడ్యులర్ బ్రిడ్జిలు ఉపయోగపడతాయి. ఈ బ్రిడ్జీలు ఒక చోట నుంచి మరో చోటికి సులువుగా తీసుకు వెళ్లవచ్చు

మాడ్యుల్‌ బ్రిడ్జ్‌లో తయారీకి L&T కంపెనీతో 2023 ఫిబ్రవరి 8న 2 వేల585 కోట్ల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. వీటిలో ఒక్కో సమూహంలో 8 ఇన్‌టూ 8 పరిమాణం కలిగిన 7 భారీ క్యారియర్‌ వాహనాలు, 10 ఇన్‌టూ 10 పరిమాణం కలిగిన రెండు భారీ లాంచ్‌ వాహనాలు ఉంటాయి. వీటిని అనుసంధానిస్తే 46 మీటర్ల పొడవు కలిగిన బలమైన వంతెన్ను తాత్కాలికంగా నిర్మించుకోవచ్చని అధికారులు తెలిపారు. ప్రస్తుతం మాడ్యుల్‌ బ్రిడ్జ్‌ను భారత ఆర్మీలో వినియోగిస్తున్న మీడియం గిర్డర్‌ బ్రిడ్జెస్‌ స్థానం ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు

Tags

Read MoreRead Less
Next Story