విమానంలో వెకిలి చేష్టలు.. పక్క సీట్లో కూర్చున్న మహిళను..

విమానంలో వెకిలి చేష్టలు.. పక్క సీట్లో కూర్చున్న మహిళను..
బుద్దిగా కూర్చుంటే వాడు మగాడు ఎట్లా అవుతాడు.. ఒంటరి మహిళ కనిపిస్తే వెకిలి వేషాలు వేయడానికి రెడీ అయిపోతాడు..

బుద్దిగా కూర్చుంటే వాడు మగాడు ఎట్లా అవుతాడు.. ఒంటరి మహిళ కనిపిస్తే వెకిలి వేషాలు వేయడానికి రెడీ అయిపోతాడు.. అది విమానమైనా, బస్సైనా మరేదైనా,. అడిగేవాడే లేడని రెచ్చిపోతుంటారు. కానీ ఇక్కడ మహిళ అప్రమత్తమవడంతో అడ్డంగా బుక్కయ్యాడు..

ఇండిగో ప్యాసింజర్ ముంబయి-గౌహతి విమానంలో ప్రయాణిస్తున్న మహిళ నిద్రలో ఉండగా పక్క సీట్లో ఉన్న వ్యక్తి ఆమెని ఇబ్బంది పెట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విమానం ల్యాండ్ అయిన తర్వాత నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.

బాధితురాలు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు చేయడంతో విమానం గౌహతిలో ల్యాండ్ అయిన తర్వాత నిందితుడిని అస్సాం పోలీసులకు అప్పగించారు.

అతడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఎయిర్‌లైన్ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ సంఘటన సెప్టెంబరు 10న విమానం 6E 5319లో జరిగింది. బాధితురాలు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు చేయడంతో విమానం గౌహతిలో ల్యాండ్ అయిన తర్వాత నిందితుడిని అస్సాం పోలీసులకు అప్పగించారు.

గత రెండు నెలల్లో, విమానాలలో కనీసం నాలుగు లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. గతంలో ఢిల్లీ-ముంబై స్పైస్‌జెట్ విమానంలో లైంగిక వేధింపుల కేసు నమోదైంది.

ఇటీవల ఆగస్టు 16న జరిగిన ఘటనలో ఢిల్లీ-ముంబై స్పైస్‌జెట్ విమానంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags

Next Story