Indore Fire: ఇండోర్‌ అగ్నిప్రమాదం వెనుక ప్రేమోన్మాది హస్తం.. యువతి పెళ్లికి ఒప్పుకోలేదని..

Indore Fire: ఇండోర్‌ అగ్నిప్రమాదం వెనుక ప్రేమోన్మాది హస్తం.. యువతి పెళ్లికి ఒప్పుకోలేదని..
Indore Fire: మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో జరిగిన అగ్నిప్రమాదం వెనక కుట్ర ఉందని తేల్చారు పోలీసులు.

Indore Fire: మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో జరిగిన అగ్నిప్రమాదం వెనక కుట్ర ఉందని తేల్చారు పోలీసులు. ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతోనే మూడు అంత‌స్తుల బిల్డింగ్‌ తగలబడిందని ముందు అంతా భావించారు. కాని, ఓ ఉన్మాది చేసిన పని వల్ల 9మంది అమాయకులు సజీవదహనం అయ్యారని తేలింది. తాను ప్రేమించిన యువతి పెళ్లికి ఒప్పుకోలేదన్న కక్షతోనే బేస్‌మెంట్‌ పార్కింగ్‌లో ఉన్న బైక్‌కు నిప్పు పెట్టాడో యువకుడు. అది కాస్తా వేరే వాహనాలకు అంటుకొని, పైఅంతస్తులకూ మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు. మృతుల కుటుంబాల‌కు మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ సంతాపం తెలిపారు.

ప్రేమోన్మాది అక్కడి వాహనాలకు నిప్పు పెట్టడంతో 9 మంది చనిపోగా, మరో 9 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘాతుకానికి పాల్పడింది ఎవరో తేల్చేందుకు చుట్టుపక్కల సీసీ ఫుటేజ్‌లు మొత్తం పరిశీలించి సంజయ్‌ అలియాస్ శుభం దీక్షిత్‌ను దోషిగా తేల్చారు. ఈ ఘోరం వల్ల 9 మంది చనిపోయారని తెలిసాక కూడా సంజయ్ అక్కడికి వచ్చాడు. సీసీ ఫుటేజ్‌ను ధ్వంసం చేసి ఆధారాలు దొరక్కుండా చేయాలనుకున్నాడు కానీ కుదరకపోవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం అతని కోసం గాలిస్తున్నారు. అటు.. చాలా లక్కీగా ఈ ఉన్మాది ప్రేమించిన యువతి క్షేమంగా ప్రాణాలతో బయటపడింది.

Tags

Read MoreRead Less
Next Story