Infosys: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడిపై ఎస్సీ, ఎస్టీ కేసు

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్ పై ఎస్సీ, ఎస్టీ అల్ట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఆయనతోపాటు మాజీ ఐఐఎస్సీ డైరెక్టర్ బలరాంతో, మరో 16 మందిపై బెంగళూరులో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు.
2014లో వీరంతా ఓ హనీ ట్రాప్ కేసులో తప్పుగా ఇరికించారని, అంతేకాకుండా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఫ్యాకల్టీ విధుల నుంచి తనను తొలగించారంటూ మాజీ ఐఐఎస్సీ ప్రొఫెసర్ దుర్గప్ప ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా కులం పేరుతో తనను దూషించి బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు 71వ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు ఆదేశాల మేరకు సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదుచేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఐఐఎస్‌సీలోని సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీలో ఫ్యాకల్టీ సభ్యుడిగా ఉన్న దుర్గప్ప.. తనపై కులపరమైన విమర్శలతో పాటు బెదిరింపులను ఎదుర్కొన్నానని పేర్కొన్నాడు. దీంతో 71వ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు ఆదేశాల మేరకు బెంగళూరు నగరంలోని సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కాగా, ఈ అంశంపై ఐఐఎస్‌సీ అధ్యాపకుల గానీ, ఐఐఎస్‌సీ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యునిగా పని చేస్తున్న ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు సేనాపతి గోపాలకృష్ణన్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఇక, ఈ కేసులో నిందితులుగా ఉన్న గోవిందన్ రంగరాజన్, శ్రీధర్ వారియర్, సంద్యా విశ్వేశ్వర్, హరి కేవీఎస్, దాసప్ప, బలరామ్ పీ, హేమలతా మిషీ, ఛటోపాద్యాయ కే, ప్రదీప్ డీ సావ్కర్ తో పాటు మనోహరన్ ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com