Infosys : యూపీఏ హయాంపై ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు..

Infosys : ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి యూపీఎ హయాంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మన్మోహన్ సింగ్ హయాంలోనూ ఆర్థిక ప్రగతి నిలిచిపోయిందన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఎ సర్కార్ సరైన టైంలో నిర్ణయాలు తీసుకోలేదన్నారు. వ్యక్తిగతంగా మన్మోహన్ సింగ్ అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు.
అహ్మదాబాద్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టూడెంట్లతో ఇంటరాక్షన్ సందర్భంగా నారాయణ మూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. 2008 నుంచి 2012 మధ్య పలుసార్లు లండన్‌లో జరిగిన HSBC సమావేశానికి తానూ హాజరయ్యానని చెప్పారు. ఆ సమావేశాల్లో చైనా పేరు 30 సార్లు వినిపిస్తే...భారత్ పేరు చాలా అరుదుగా వినిపించేదన్నారు. ఐతే ప్రస్తుతం ప్రపంచ వాణిజ్యంలో భారత్ ఆశలు చిగురించాయన్నారు. భారత్‌ను చైనాకు పోటీగా మార్చే సత్తా ఈ దేశ యువతకు ఉందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com