Rakesh Tikait: బీకేయూ చీఫ్ రాకేష్ తికాయత్‌పై ఇంక్ ఎటాక్.. ప్రెస్ మీట్‌లోనే..
Rakesh Tikait: బెంగళూరులో భారతీయ కిసాన్ యూనియన్ చీఫ్ రాకేష్ తికాయత్‌పై ఇంక్ ఎటాక్ జరిగింది. అక్కడ రైతు సంఘాలతో కలిసి ఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతుండగా కొందరు వ్యక్తులు నల్ల సిరాను ఆయన మొహంపై వేశారు. దీంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారుల్ని అడ్డుకునేందుకు మిగతా వారు ప్రయత్నించడంతో ఘర్షణ మరింత పెద్దదైంది.
ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. రైతు నాయకుడు చంద్రశేఖర్ తనపై చేసిన విమర్శలకు.. తికాయత్ సమాధానం ఇస్తుండగా ఈ ఎటాక్ జరిగింది. వచ్చినవారు చంద్రశేఖర్ మద్దతుదార్లుగా భావిస్తున్నారు. రైతుల నుంచి డబ్బు వసూళ్ల ఆరోపణల్ని ఖండించిన ఆయన.. BJP ప్రభుత్వం తమకు భద్రత కల్పించడంలో విఫలమైందని, ఈ ఇంక్ దాడి ప్రభుత్వ సహకారంతోనే జరిగిందని ఆరోపించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com