Charred bodies : కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు.. ఏడుగురు కార్మికులు మృతి

Charred bodies : కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు.. ఏడుగురు కార్మికులు మృతి
24మందికి గాయాలు

కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది. మంటల్లో కాలి ఏడుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. మరో 27 మంది కార్మికులకు కాలిన గాయాలయ్యాయి. గుజరాత్‌లోని సూరత్‌లో ఈ సంఘటన జరిగింది. ఏథర్ ఇండస్ట్రీస్‌లో బుధవారం తెల్లవారుజామున కెమికల్‌ స్టోరేజీ ట్యాంకులో మంటలు చెలరేగాయి. దీంతో భారీగా పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికులు పదుల సంఖ్యలో గాయపడ్డారు. మరికొందరు అదృశ్యమయ్యారు.

కాగా, ఫైర్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన తర్వాత అదృశ్యమైన కార్మికుల కోసం గురువారం వెతికారు. ఈ నేపథ్యంలో ఏడుగురు కార్మికులు కాలి బూడిదిగా మారినట్లు గుర్తించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు, ఫైర్‌ అధికారులు తెలిపారు. గుజరాత్‌లోని అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తల్లో ఒకరు, 1.3 మిలియన్‌ డాలర్ల సంపద ఉన్న అశ్విన్ దేశాయ్‌కు చెందిన కంపెనీగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దాదాపు 15 ఫైర్ ఇంజన్లతో 10 గంటలపాటు శ్రమించిన తరువాతే మంటలు అదుపులో వచ్చాయి. కెమికల్ బ్లాస్ట్ కావడంతో మంటల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే అగ్నికి ఆహుతయ్యారు. వీరిలో ఆరుగురు కాంట్రాక్ట్ ఉద్యోగులు కాగా ఒకరు కంపెనీ ఉద్యోగి. మరో 25 మందికి తీవ్ర గాయాలవడంతో సమీపంలో వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని సూరత్ జిల్లా కలెక్టర్ ఆయూష్ ఓక్ తెలిపారు.

కెమికల్ ఫ్యాక్టరీ ట్యాంకులో నిల్వ ఉండే రసాయనాలు లీక్ అవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా సూరత్ ఫైర్ ఆఫీసర్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 150మంది పనిచేస్తున్నట్టు సమాచారం. మృతుల్లో కంపెనీ ఉద్యోగి దివ్యేష్ పాటిల్ సహా ఒప్పంద కార్మికులు సంతోష్ విశ్వకర్మ, సనత్ కుమార్ మిస్రా, ధర్మేంద్ర కుమార్, గణేష్ ప్రసాద్, సునీల్ కుమార్, అభిషేక్ సింఘ్ ఉన్నారు.

Tags

Next Story