Indian Intelligence Agencies: దేశంలో డ్రోన్, ఐఈడీ దాడులు జరగొచ్చు

దేశంలో ఉగ్రదాడులు జరగొచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు రైల్వేశాఖను అప్రమత్తం చేశాయి. డ్రోన్, ఐఈడీతో దాడులు జరగవచ్చని సూచించాయి. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో హింస చెలరేగింది. రెండు చోట్ల రైల్వే స్టేషన్‌లోకి చొరబడి రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. వక్ఫ్ చట్టం వ్యతిరేకంగా అల్లర్లు సృష్టిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నా.. దీని వెనుక కుట్ర దాగి ఉన్నట్లుగా గవర్నర్ ఆనంద్ బోస్ అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఇప్పటికే పోలీసులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేశారు.
ఉగ్రవాదులు నదీమార్గాల ద్వారా దేశంలోకి చొరబడ వచ్చని నిఘా వర్గాలు తెలిపాయి. ముంబై దాడుల నిందితుడు తహవూర్ రాణాను అమెరికా నుంచి ఢిల్లీకి తీసుకొచ్చాక.. నిఘా వర్గాలు హెచ్చరిక చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే జమ్మూకాశ్మీర్‌లోని బోర్డర్‌లో ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించగా.. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఈ ఘటనలో ఒక సైనికుడు కూడా అమరుడయ్యాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com