బ్రెయిన్ లో అంతర్గత రక్తస్రావం.. శస్త్ర చికిత్స చేయించుకున్న సద్గురు

బ్రెయిన్ లో అంతర్గత రక్తస్రావం.. శస్త్ర చికిత్స చేయించుకున్న సద్గురు
ఆధ్యాత్మిక నాయకుడు సద్గురు అంతర్గత రక్తస్రావం కారణంగా బ్రెయిన్ సర్జరీ చేయించుకున్నారు.

ఆధ్యాత్మిక నాయకుడు సద్గురు అంతర్గత రక్తస్రావం కారణంగా బ్రెయిన్ సర్జరీ చేయించుకున్నారు. కొన్ని వారాలుగా విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్న ఆయన, స్కానింగ్‌కు వెళ్లిన తర్వాతే అతడి పరిస్థితి నిర్థారణ అయిందని ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు.

ఆధ్యాత్మిక నాయకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ అంతర్గత రక్తస్రావం కారణంగా మెదడుకు శస్త్రచికిత్స జరిగింది. ఆదివారం (మార్చి 17) ఆపరేషన్ తర్వాత అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఢిల్లీలోని అపోలో ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

డాక్టర్ వినిత్ సూరి, డాక్టర్ ప్రణవ్ కుమార్, డాక్టర్ సుధీర్ త్యాగి, డాక్టర్ ఎస్ ఛటర్జీలతో కూడిన వైద్యుల బృందం మెదడులో రక్తస్రావం జరగడాన్ని గుర్తించారు. అతను ఆస్పత్రిలో చేరిన కొద్ది గంటల్లోనే అత్యవసర మెదడు శస్త్రచికిత్సను నిర్వహించింది వైద్య బృందం.

సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ వినిత్ సూరి X లో ఒక వీడియో పోస్ట్ చేశారు. “సద్గురు ఇప్పుడే ప్రాణాపాయ పరిస్థితిని ఎదుర్కొన్నారు. అతను గత నాలుగు వారాలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నా దానిని విస్మరించారు. మార్చి 8న జరిగే మహాశివరాత్రి కార్యక్రమానికి చాలా పనులు ఉన్నాయని తన తలనొప్పిని అశ్రద్ధ చేశారు.

పని పట్ల నిబద్ధతతో తన పరిస్థితి తీవ్రతను పట్టించుకోలేదని వైద్యులు తెలిపారు. “మార్చి 15 సాయంత్రం నొప్పి తీవ్రం కావడంతో సద్గురు వైద్యులను సంప్రదించాడరు. అప్పుడు వైద్యులు వెంటనే MRIని సూచించారు. కానీ అతను సమావేశానికి ముందస్తు కమిట్‌మెంట్‌లను కలిగి ఉన్నందున అతను MRI కోసం వెళ్ళడానికి ఇష్టపడలేదు. 40 ఏళ్లలో తాను ఎప్పుడూ మీటింగ్‌ను మిస్ చేసుకోలేదని చెప్పారు. అయినప్పటికీ, మేము అతనిని ఎలాగో ఒప్పించి స్కానింగ్ తీయించాము.

66 ఏళ్ల ఆధ్యాత్మిక నాయకుడికి మెదడు కింద రెండుసార్లు రక్తస్రావం అయ్యిందని, వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచించారని, అయితే అతని షెడ్యూల్ కారణంగా ఆలస్యం చేశారని ఆయన అన్నారు. "అతనికి నొప్పి బాధిస్తున్నా ఈవెంట్‌లకు హాజరవడం చూసి మేము ఆశ్చర్యపోయాము అని వీడియోలో డాక్టర్ వివరించారు.

న్యూరాలజిస్ట్ మాట్లాడుతూ, “మార్చి 17 న, అతని పరిస్థితి మరింత దిగజారింది. మగతగా ఉన్నారు. అతనికి పదేపదే వాంతులు కావడంతో పాటు ఎడమ కాలు బలహీనంగా మారింది. ఇక అప్పుడు సద్గురు మమ్మల్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి అని అన్నారు. ఆయన అలా అనడం అదే మొదటిసారి.

వాపు అతని మెదడు యొక్క స్థితిని మార్చింది. అతను గందరగోళంగా, మగతగా ఉన్నందున మార్చి 17 న అడ్మిట్ అయిన వెంటనే అతనికి ఆపరేషన్ చేశాము అని చెప్పారు. సద్గురు ఊహించిన దానికంటే వేగంగా కోలుకుంటున్నారని ఆయన అన్నారు. స్పృహ వచ్చిన తర్వాత, ఆధ్యాత్మిక నాయకుడు అపోలో హాస్పిటల్‌లోని వైద్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ, "ఇదిగో నేను ఢిల్లీ హాస్పిటల్‌లో పాచ్ స్కల్‌తో ఉన్నాను, కానీ మెదడు దెబ్బతినలేదు" అని నవ్వుతూ చెప్పారు. .

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం X లో పోస్ట్ చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దానికి సద్గురు సమాధానం వ్రాస్తూ.. “ప్రియమైన ప్రధాన్ మంత్రిజీ, నా గురించి మీరు ఆందోళన చెందకూడదు. మీరు నిర్వహించడానికి ఒక దేశం ఉంది. నేను కోలుకునే మార్గంలో ఉన్నాను. మీ పలకరింపుతో పొంగిపోయాను. ధన్యవాదాలు అని తెలిపారు.

" సద్గురు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ కూడా X లో ఓ సందేశాన్ని పంపారు. “సద్గురు జీకి శస్త్రచికిత్స అని విన్నప్పుడు చాలా ఆందోళన చెందాను. అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అని రాశారు.

Tags

Read MoreRead Less
Next Story