Iran – Israel: ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్‌ క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్‌..

Iran – Israel: ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్‌ క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్‌..
X
టెల్‌ అలీవ్‌ అంతటా సైరన్ల మోత

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇరాన్‌లో ఉన్న వైమానిక క్షేత్రాలే లక్ష్యంగా ఐడీఎఫ్‌ దళాలు విరచుకుపడ్డ విషయం తెలిసిందే. ప‌శ్చిమ‌, తూర్పు, సెంట్రల్ ఇరాన్ ప్రాంతాల్లో ఉన్న సుమారు ఆరు విమానాశ్రయాల‌పై ఇజ్రాయెల్ మిలిట‌రీ అటాక్ చేసిన‌ట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. ఈ దాడి తర్వాత ఇరాన్‌ సైతం ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. రాజధాని జెరూసలేం సహా పలు ప్రధాన నగరాలపై బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించింది. దాదాపు 15 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. దీంతో జెరూసలేంలో పెద్ద ఎత్తున పేలుళ్లు వినిపించినట్లు ప్రముఖ వార్తా సంస్థ ఏఎఫ్‌పీ నివేదించింది. ఉత్తర ఇజ్రాయెల్‌ అంతటా సైరన్లు మోగినట్లు పేర్కొంది. ఈ దాడులను ఇజ్రాయెల్‌ సైన్యం సైతం ధృవీకరించింది.

అంతకు ముందు ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దళాలు విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. ప‌శ్చిమ‌, తూర్పు, సెంట్రల్ ఇరాన్ ప్రాంతాల్లో ఉన్న సుమారు ఆరు విమానాశ్రయాల‌పై ఇజ్రాయెల్ మిలిట‌రీ అటాక్ చేసింది. ఈ విషయాన్ని ఐడీఎఫ్‌ ఎక్స్ ద్వారా ప్రకటించింది. రిమోట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల‌తో జ‌రిగిన దాడిలో సుమారు 15 ఇరాన్ విమానాలు, హెలికాప్టర్లు ధ్వంసం అయిన‌ట్లు ఐడీఎఫ్ తెలిపింది. దాడుల వ‌ల్ల విమానాశ్రయ ర‌న్‌వేలు, అండ‌ర్‌గ్రౌండ్ బంక‌ర్లు, రీఫుయ‌లింగ్ విమానం, ఎఫ్‌-14, ఎఫ్‌-5, ఏహెచ్‌-1 విమానాలు ధ్వంసమైన‌ట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. టార్గెట్ చేసిన విమానాశ్రయాల్లో మెహ్రబాద్‌, మాష‌ద్‌, డెజ్‌ఫుల్ ప్రదేశాలు ఉన్నాయి. ఈ విమానాశ్రయాల్లో టేకాఫ్ జ‌ర‌గ‌కుండా ఉండే రీతిలో ఇజ్రాయెల్ మిలిట‌రీ అటాక్ కొన‌సాగించింది. ఇరాన్ ఆర్మీ స్థావ‌రాల‌ను ధ్వంసం చేసిన‌ట్లు చెప్పింది.

మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్‌ సుప్రీం లీడర్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. శత్రువులు కఠినమైన శిక్షణు ఎదుర్కొంటారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘దాడులు కొనసాగుతాయి. శత్రువు భారీ తప్పు చేసింది. పెద్ద నేరానికి పాల్పడింది. శిక్షించాల్సిందే. ఇప్పటికే శిక్ష మొదలైంది. అమెరికా, ఇజ్రాయెల్‌కు కఠినమైన, నిర్ణయాత్మకమైన ప్రతిస్పందన ఉంటుంది’ అని ఖమేనీ వార్నింగ్‌ ఇచ్చారు.

Tags

Next Story