Chandrayaan-3: చంద్రయాన్ -3 ల్యాండింగ్ సైట్ ఇక అధికారికంగా ‘శివ శక్తి’

గతేడాది భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అయింది. చంద్రుడి దక్షిణ ధృవంపై దిగిన తొలి అంతరిక్ష నౌకగా చంద్రయాన్-3 చరిత్ర సృష్టించింది. గతేడాది ఆగస్టు 23న చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రాంతానికి ‘‘శివశక్తి’’ పాయింట్‌గా ప్రధాని నరేంద్ర మోడీ పేరు పెట్టారు. అయితే, ఈ పేరుకు ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్(IAU) ఆమోదం తెలిపింది. దీంతో 7 నెలల తర్వాత అధికారికంగా విక్రమ్ దిగిన ప్రాంతానికి ‘‘శివశక్తి’’ పాయింట్‌గా నామకరణం చేసినట్లు అయింది.
పారిస్‌లోని ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనిన్ (IAU) స్టాటియో శివశక్తి పాయింట్ పేరును శనివారం ఆమోదించింది. చంద్రయాన్-3 మిషన్‌ను ఇస్రో జులై 14న చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి రాకెట్‌ను ప్రయోగించింది. సుధీర్ఘ సమయం అనంతరం విక్రమ్ ల్యాండర్ ఆగస్టు 23న సాయంత్రం 6.4 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగింది. ఇస్రో రూ.615కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్వహించింది. ఇస్రో ఇప్పటి వరకు మూడు మిషన్లు నిర్వహించింది.
చంద్రయాన్-1, చంద్రయాన్-2 మిషన్లను నిర్వహించగా.. నాలుగేళ్ల కిందట చంద్రయాన్-2 చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ను దింపేందుకు ప్రయత్నించగా.. కొద్దిసేపటికే ఇస్రోతో ల్యాండర్‌కు సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత ల్యాండర్ కూలిపోయినట్లు తేలింది. ఇక గతేడాది జులైలో చంద్రయాన్-3లో విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా జాబిల్లిపై వాలింది. ఆ తర్వాత ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చి చంద్రుడి ఉపరితలంపై ప్రయాణించింది. మిషన్‌లో పంపిన ఏడు పేలోడ్స్ చంద్రుడికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని సేకరించి ఇస్రోకు పంపాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com