Chandrayaan-4 : చంద్రుడిపై మట్టి, రాళ్లు తేవటమే లక్ష్యం

Chandrayaan-4 :  చంద్రుడిపై మట్టి, రాళ్లు తేవటమే లక్ష్యం
X
మూడు తర్వాత నాలుగుపైనే ఇస్రో కన్ను

చంద్రయాన్‌-3 విజయంతో అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర లిఖించిన భారత్‌. మరో కీలక ప్రాజెక్టుకు సిద్ధమైంది. చంద్రయాన్‌-4 లేదా లుపెక్స్‌ పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా చంద్రుడి పైనుంచి రాళ్లు, మట్టి నమూనాలను భూమి మీదకు తీసుకురావాలని ఇస్రో భావిస్తోంది. పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నస్పేస్ అప్లికేషన్‌ సెంటర్ డైరెక్టర్‌ నీల్ దేశాయ్‌...చంద్రయాన్‌-4 గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

అగ్ర దేశాలకు సాధ్యంకాని చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ను సాఫ్ట్‌ ల్యాండ్‌ చేసి చరిత్ర సృష్టించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో.. ఇప్పుడు చంద్రయాన్‌ 4 ప్రయోగానికి సిద్ధమైంది. లుపెక్స్‌ పేరుతో చంద్రునిపై నుంచి రాళ్లు, మట్టిని తీసుకొచ్చే ప్రాజెక్టు వైపు ఇస్రో అడుగులు వేస్తోందని స్పేస్ అప్లికేషన్‌ సెంటర్ డైరెక్టర్‌ నీల్ దేశాయ్‌ తెలిపారు. చంద్రుడి ఉపరితలంపై అన్వేషణకు సిద్ధమవుతున్నామనీ ఇందుకోసం లునార్‌ పోలార్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ మిషన్‌ను సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.


చంద్రయాన్‌-4లో జాబిల్లి ఉపరితలంపై 90 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద ల్యాండర్‌ దిగనుందనీ ఇందులో 350 కేజీల బరువున్న రోవర్‌ను పంపనున్నట్లు నీల్ దేశాయ్‌ తెలిపారు. ఇది కిలోమీటరు మేర చంద్రుడిపై తిరుగాడనుందని సమచారం. చంద్రయాన్‌-3 మిషన్ జీవిత కాలం ఒక ల్యూనార్‌ డే అంటే.. భూమిపై 14 రోజులతో సమానం కాగా.. చంద్రయాన్‌-4.. ఏడు లునార్‌ డేలు అంటే దాదాపు భూమిపై వంద రోజులు సమానమైన కాలం పనిచేస్తుంది. ఈ సమయంలో రోవర్‌లోని పరికరాలు చంద్రుడిపై రాళ్లు, మట్టి నమూనాలను సేకరించి భూమి మీదకు తీసుకొస్తాయి. ఈ ప్రాజెక్ట్‌ కోసం రెండు లాంచ్‌ వెహికల్స్‌ను సిద్ధం చేయాల్సి ఉంటుందనీ దీనికి ఐదు నుంచి పదేళ్ల సమయం పడుతుందని నీల్‌ దేశాయ్‌ వెల్లడించారు. చంద్రయాన్‌-3 విజయం తర్వాత మరింత పెద్ద సవాల్‌కు సిద్ధం కావాలని ప్రధాని మోదీ ఇస్రో శాస్త్రవేత్తలకు సూచించారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం జపాన్‌ అంతరిక్ష సంస్థ జాక్సాతో కలిసి ఇస్రో పనిచేస్తోందని చెప్పారు.

తమ అంచనాల ప్రకారం..చంద్రయాన్-4లో 90 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద ల్యాండ్ దిగుతుందని..దీంట్లో 350 కిలోల బరువున్న రోవర్ ను పంపనున్నామని తెలిపారు. అంటే చంద్రయాన్-3 కి అంతకు మించి అన్నట్లుగా ఈ చంద్రయాన్-4 ఉందనుంది అనే విషయం తెలుస్తోంది. ఈ చంద్రయాన్ -4 చంద్రుడిపై కిలోమీటర్ మేర తిరుగాడుతుందని చంద్రుడిపై కచ్చితమైన ల్యాండింగ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని..తెలిపారు. ఇదో పెద్ద సవాలుగా భావిస్తున్నామని తెలిపారు.చంద్రయాన్-4తో ఇస్రో అనుకున్న లక్ష్యాలు సాధించగలిగితే ఇక భారత్ పేరు సువర్ణాక్షరాలతో లిఖించే ఘనతను సాధించినట్లే.

Tags

Next Story