ISRO : రాకెట్ ప్రయోగం గ్రాండ్ సక్సెస్…

ISRO : రాకెట్ ప్రయోగం గ్రాండ్ సక్సెస్…
ఒకేసారి నింగిలోకి 7 ఉపగ్రహాలు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో భారీ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ రోజు ఆదివారం ఉదయం 6.30కి శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి PSLV-C56 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగంతో... సింగపూర్ డీఎస్-ఎస్ఏఆర్ తోపాటు ఏడు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెడుతున్నారు.

ఇందులో భాగంగా 422 కిలోల బరువు కలిగిన ఏడు ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. మొత్తం నాలుగు దశల్లో రాకెట్ ను ప్రయోగించారు. వాతావరణం అత్యంత అనుకూలంగా ఉండటంతో PSLV-C56 రాకెట్ నింగిలోకి రివ్వున దూసుకెళ్లింది. అన్ని వ్యవస్థలూ బాగా పనిచేశాయి. ఇది సింగపూర్ కోసం చేపట్టిన పూర్తి కమర్షియల్ ప్రయోగం. దీంతో అంతర్జాతీయంగా రోదసీకి సంబంధించిన వాణిజ్యపరమైన అంశాల్లో ఇస్రో సాయాన్ని మరిన్ని దేశాలు కోరుకుంటాయి. తద్వారా ఇస్రోకి మరింత ఆదాయం రాగలదు. ఫలితంగా ఆర్ధిక, సాంకేతిక పరంగా సమీప భవిష్యత్తులో నాసాకి పోటీగా ఇస్రో ఎదిగే అవకాశం ఉంది.



ఈ నెలలో ఇస్రోకి ఇది రెండో రాకెట్ ప్రయోగం.దీనిని సక్సెస్ చెయ్యడం ద్వారా మరో విజయాన్ని ఇస్రో తన అకౌంట్‌లో వేసుకున్నట్లు అయ్యింది. పీఎస్ఎల్వీ-సీ56 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రవేత్తలకు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ అభినందనలు తెలిపారు. సెప్టెంబర్ లో మరో పూర్తి కమర్షియల్ పీఎస్ఎల్వీ ప్రయోగం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story