Chandrayaan-3: లక్ష్యం దిశగా…

Chandrayaan-3: లక్ష్యం దిశగా…
X
ఐదో దశ కక్ష్య పెంపు విజయవంతం

చందమామను చేరుకోవడానికి, దాని గుట్టు తెలుసుకునేందుకు భూమి నుంచి బయలుదేరిన చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్ లక్ష్యం దిశగా సాగుతోంది. స్పేస్‌క్రాఫ్ట్‌ను చంద్రుడికి చేరువచేసేందుకు ఇప్పటికే నాలుగుసార్లు విజయవంతంగా కక్ష్య పెంచిన ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్‌-3ని ఐదో కక్ష్యలోకి చేర్చే ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు.

బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ నుంచి ఈ విన్యాసాన్ని చేపట్టింది. ప్రస్తుతం భూమికి 71351 x 233 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో తిరుగుతున్న చంద్రయాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్‌.. ఇక ఐదో దశ కక్ష్య పెంపు సక్సెస్‌ కావడంతో భూమికి 1,27,609 x 236 కిలోమీటర్ల దూరంలోగల కక్ష్యలోకి చేరనుందని అంచనా వేస్తున్నారు. భూమి చుట్టూ తిరిగే విషయంలో చంద్రయాన్‌-3కి సంబంధించి ఇదే చివరి కక్ష్య. దీని తర్వాత వ్యోమనౌక ఆగస్టు 1వ తేదీన చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఆగస్టు 1వ తేదీ రాత్రి 12 నుంచి ఒంటిగంట మధ్యలో ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఇస్రో చేపట్టనుంది.



జులై 14న చంద్రయాన్‌-3ను LVM3-M4 రాకెట్‌ ద్వారా ఇస్రో విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టింది. స్పేస్‌క్రాఫ్ట్‌ అంతరిక్షంలోకి దూసుకెళ్లిన తర్వాత 15న తొలి సారి, 16న రెండో సారి, 18న మూడో సారి , 20న నాలుగో సారి , 25న ఐదో సారి కక్ష్య పెంపు ప్రక్రియలను విజయవంతంగా నిర్వహించారు. అంతా సజావుగా సాగితే ఆగస్టు 23న సాయంత్రం చంద్రుడిపై ల్యాండర్‌ అడుగుపెడుతుంది.

Tags

Next Story