Chandrayan-3: విక్రమ్, ప్రజ్ఞాన్ లకు జోలపాడుతున్న చందమామ..

చంద్రయాన్-3 మిషన్‌లో ప్రజ్ఞాన్ రోవర్ తొలివిడత ప్రక్రియ పూర్తయింది. తనకు అప్పగించిన పనులను ప్రజ్ఞాన్ విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో ప్రకటించింది. చంద్రుడిపై పగలు ముగుస్తున్న నేపథ్యంలో రోవర్‌ను సురక్షిత ప్రదేశంలో స్లీప్ మోడ్‌లోకి పంపింది. దానికి అమర్చిన APXL, LIBS పేలోడ్ పనులను నిలిపేసినట్లు ఇస్రో పేర్కొంది.
ఆగస్టు 23న జాబిల్లిపైకి చేరిన చంద్రయాన్-3 ల్యాండర్, రోవర్ చురుగ్గా తమ పనిని పూర్తి చేసాయి. రోవర్ జాబిల్లిపై తిరుగుతూ పరిశోధనలు చేస్తుంటే...అది విశ్లేషించిన మొత్తం సమాచారాన్ని ల్యాండర్ భూమిపైన ఇస్రో డేటా కేంద్రానికి చేరవేస్తోంది. ఇన్నాళ్లూ మనకి తెలియని ఎన్నో కొత్త విషయాలను ప్రజ్ఞాన్ రోవర్ అధ్యయనంలో తెలిశాయి. చంద్రుడిపై సల్పర్, అల్యూమినియం, కాల్షియం, ఇనుము, క్రోమియం, టైటానియం, సిలికాన్, మాంగనీస్, ఆక్సిజన్ మూలకాలను ప్రజ్ఞాన్ రోవర్ గుర్తించింది. చంద్రుడిపై సల్ఫర్ ఉన్నట్లు రోవర్‌లోని LIBS పరికరంతో పాటు APXS పరికరం కూడా ధ్రువీకరించాయి. అయితే చంద్రుడిపై సల్ఫర్ ఎలా వచ్చిందో శాస్త్రవేత్తలు తాజా విశ్లేణలను అభివృద్ధి చేయాల్సి వస్తుందని ఇస్రో తెలిపింది. అలాగే చంద్రుడి ఉపరితలంపై ఉన్న ఉష్ణోగ్రతలను రోవర్ భూమికి చేరవేసింది.
ఇప్పటివరకూ జాబిల్లిపై మన శాస్త్రవేత్తలకు తెలియని.. ఎన్నో అంశాలను రోవర్ గుర్తించింది. ఈ డేటాను ఇస్రో శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. జాబిల్లిపై రోవర్ సెంచరీ కొట్టిందని తాజాగా ఇస్రో సామాజిక మాధ్యమాల్లో తెలిపింది. ల్యాండర్ నుంచి 100 మీటర్ల దూరం పయనించిందని వివరించింది. చంద్రుడిపై పగటిపూట ల్యాండర్‌ను, రోవర్‌ను దించిన ఇస్రో 14 రోజుల పగలు పూర్తై చీకటి పడగానే రెండింటిని నిద్రపుచ్చనుంది. చంద్రునిపై రాత్రి అంటే భూమిపై 14 రోజులతో సమానం. అంటే భూమిపై 24 గంటలంటే చంద్రునిపై 28 రోజులతో సమానం. ఇప్పుుడు రాత్రి ప్రారంభం కానుండటంతో 14 రోజుల వరకూ సూర్యరశ్మి ఉండదు సరికదా..ఉష్ణోగ్రత రాత్రి సమయంలో మైనస్ 200 డిగ్రీలకు పడిపోతుంది.
అంందుకే ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్‌లు పనిచేయవు. అందుకే ఈ రెండింటినీ స్లీపింగ్ మోడ్‌కు ఇనీషియేట్ చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. ముందు ప్రజ్ఞాన్ రోవర్‌ను స్లీప్ మోడ్‌కు పంపించగా..త్వరలో విక్రమ్ ల్యాండర్‌ను కూడా నిద్రావస్థలోకి మళ్లించనున్నారు. ఆగస్టు 23న చంద్రయాన్-3 చంద్రుడిపై దిగినప్పుడు చంద్రుని సూర్యోదయం జరిగింది. కాబట్టి, చంద్రునిపై తదుపరి చంద్ర సూర్యోదయం సెప్టెంబర్ 22న సంభవిస్తుందని ఇస్రో అంచనా వేసింది. అన్నీ సజావుగా సాగితే మరికొన్ని రోజుల పాటు ప్రజ్ఞాన్ తన పరిశోధనలను కొనసాగించనుంది. లేదంటే భారతదేశపు ప్రతినిధిగా చంద్రుడిపై శాశ్వతంగా ఉండిపోనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com