క్యాంపస్ లో క్యాస్ట్ ముచ్చట్లు వద్దు: విద్యార్థులకు ఐఐటీ బాంబే హెచ్చరిక

ఐఐటీ బాంబే అంతటి ప్రఖ్యాత విద్యాలయంలో చదువుకున్న విద్యార్ధులు కూడా ఆత్మహత్యలకు పాల్పడడం తల్లిదండ్రులకు తీరని దు:ఖాన్ని మిగులుస్తుంది. అలాంటి వాటిల్లో సీటు రావడం ఎంతో కష్టం. విద్యార్ధి ఎంతటి మేధావి అయితేనో వస్తుంది. కానీ అక్కడ చదువుతున్న విద్యార్ధుల్లో విశాల ధృక్పథం లేకపోవడం విచారకరం.
ఈ ఏడాది ఫిబ్రవరి 12న హాస్టల్ భవనం ఏడో అంతస్థు నుంచి కిందకు దూకి దర్శన్ సోలంకి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కులం పేరుతో తోటి విద్యార్ధులు అతడిని దూషించడమే ప్రధాన కారణంగా పేర్కొంటూ తల్లిదండ్రులకు ఫోన్ చేసి వాపోయేవాడు.. అదే అతడి ఆత్మహత్యకు కారణమని తల్లిదండ్రులు, యూనివర్శిటీ కూడా భావించింది. దాంతో తోటి విద్యార్ధుల కుల గోత్రాలను అడగరాదనీ, జేఈఈ ర్యాంకు, గేట్ స్కోరును కూడా ఆరాతీయకూడదని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇలాంటి ప్రశ్నలు విద్యార్థుల్లో ఆత్మనూన్యతకు దారి తీస్తుందని పేర్కొంది. క్యాంపస్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలని, స్టూడెంట్ లైఫ్ లో ఇది చాలా ముఖ్యమైన ఘట్టమని పేర్కొంది. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com