ఐటీ ఉద్యోగాలు, డే అండ్ నైట్ డ్యూటీలు.. విడాకులు కోరిన జంటకు సుప్రీం..

ఐటీ ఉద్యోగాలు, డే అండ్ నైట్ డ్యూటీలు.. విడాకులు కోరిన జంటకు సుప్రీం..
విభిన్న మనస్తత్వాలు ఉన్న ఇద్దరు వ్యక్తులు వివాహబంధంలోకి అడుగుపెడతారు.

విభిన్న మనస్తత్వాలు ఉన్న ఇద్దరు వ్యక్తులు వివాహబంధంలోకి అడుగుపెడతారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొన్ని రోజులు టైమ్ పడుతుంది. అందునా వారిద్దరూ సాప్ట్‌వేర్ ఉద్యోగులు ఒకరికి రాత్రి డ్యూటీ అయితే, మరొకరికి పగలు పని, మరి ఒకరిని మరొకరు అర్థం చేసుకునే సమయం ఎక్కడిది.. ఉన్న కొద్ది సమయంలో కూడా గొడవలు పడితే ఆ వివాహ బంధం ఎలా నిలుస్తుంది అని సుప్రీం వారికి చీవాట్లు పెట్టింది. మరోసారి ఆలోచించుకోమని భార్యాభర్తలిద్దరికీ సూచించింది

బెంగళూరుకు చెందిన ఓ దంపతుల విడాకుల పిటిషన్‌ను జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన సుప్రీం ధర్మాసనం విచారించింది. ఇద్దరి మధ్య అనుబంధానికి సమయం ఎక్కడుంది. అటువంటప్పుడు కలిసి ఉండడానికి మరోసారి ఎందుకు ప్రయత్నించకూడదు అని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. బెంగళూరులో విడాకుల కోసం కోర్టుకు ఎక్కే వారి సంఖ్య చాలా తక్కువ. అందుకే కలిసి ఉండేందుకు ఆలోచించండి అని దంపతులకు నచ్చచెప్పారు.

కానీ అప్పటికే ఒక ఒప్పందానికి వచ్చిన భార్యాభర్తలు సుప్రీం దృష్టికి తీసుకువెళ్లారు. కేసు విచారణలో ఉండగానే సుప్రీం కోర్టు మీడియేషన్ సెంటర్‌కు వెళ్లినట్లు చెప్పారు. అందులో ఇద్దరూ వివాహం రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు సెటిల్‌మెంట్ చేసుకున్నట్లు సుప్రీం ధర్మాసనానికి తెలియజేశారు. దీంతో విడాకులు మంజూరు చేయడంతో పాటు కేసుకు సంబంధించి రాజస్థాన్, లఖ్‌నవూలలో నమోదైన కేసులన్నింటినీ సుప్రీం కొట్టివేసింది.

Tags

Read MoreRead Less
Next Story